
International Left-Handers Day 2023: ప్రతీ విషయంలో మంచి, చెడు ఉంటాయి. మంచినీ, చెడునీ.. పవిత్రతనూ, అపవిత్రతనూ ఈ కుడి, ఎడమలతోనే పోల్చితే కుడి వైపు మంచిదని, ఎడమవైపు చెడుదని అంటుంటారు. మొదటిసారి ఇంట్లో అడుపెట్టాలనుకుంటే కుడికాలే పెట్టమంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కుడి చేతినే అందిస్తుంటాం.. సాధారణ వ్యక్తులు ఏపని చేసినా కుడిచేయితోనే చేస్తుంటారు. కానీ వీరికి భిన్నంగా ఎడమ చేతివాటమున్న వ్యక్తులు చేసే పనులు చాలా విచిత్రంగా, ఇన్ ట్రెస్టింగ్ గా ఉంటాయి.
ఎన్నో సవాళ్లు..
ఎడమ చేతివాటం ఉన్నవారు (Left-Handers) నిత్యజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొన్నపుడు వీరు ఎడమ చేతిలో అన్ని పనులు చేస్తున్నపుడు ఎదుటివారి నుంచి కామెంట్లు వస్తుంటాయి. ఎడమచేతితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఎడమ చేతితో భోజనం తింటున్నా, ఎదుటివారికి వడ్డించినా కొంతమంది వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. చివరికి కంప్యూటర్ మౌస్ కూడా వీరికి అసౌకర్యానికి గురిచేస్తుంది.. చిన్న సమస్యలే అని అనిపించినా అవి అనుభవిస్తేనే తెలుస్తుంది.
కుడి చేతి వాటం గలవాకె మెజారిటీగా ఉన్న సమాజంలో ఎడమ చేతి వాటం వారు చేసే పనులను చిత్రంగా చూడటం మామూలే. కుడి చేతి వాటంవారు ఎడమ చేతికి వాచీలు పెట్టుకుంటారు కాబట్టి, కుడి చేతికి పెట్టుకోవడం అదొక వింతగా ఉంటుంది. కొన్ని నవ్విస్తే మరికొన్ని బాధపెడతాయి.
అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే ప్రాముఖ్యత
ప్రపంచవ్యాప్తంగా ఎడమచేతి వాటం వ్యక్తుల కోసమే ఈ రోజు (ఆగస్టు 13) అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే వేడుకలను జరుపుకుంటారు. ఇది ఎడమచేతి వాటం వారు నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, విజయాల గురించి అవగాహన పెంచుకోవడానికి, ప్రధానంగా కుడిచేతి వాటమున్నవారితో మమేకమయ్యేందుకు ఇలాంటి వేడుకలు వేదికగా నిలుస్తాయి. ఈ రోజు మన ఎడమచేతి వాటం స్నేహితులను, వారి కుటుంబ సభ్యులను గౌరవించటానికి ఒక అద్భుతమైన సందర్భంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10% మంది మాత్రమే ఎడమచేతి వాటం వారు ఉన్నారు. . ఈ రోజున ఎడమచేతి వాటం వ్యక్తులు వివిధ రంగాల్లో ఎదిగినతీరు, వారి జీవితంలో వైవిధ్యాన్ని గుర్తించి అభినందించడానికి ప్రజలు కలిసి వస్తారు..
ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే.. అనేది ఎడమ చేతివాటం వారి గురించి తెలుసుకోవడానికి, అపోహలను తొలగించడానికి, సమాజంలోని వివిధ అంశాలలో ఎడమచేతి వాటం వారి సహకారాన్ని అభినందించడానికి అవకాశాన్ని అందిస్తుంది.
అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే చరిత్ర
లెఫ్ట్-హ్యాండర్స్ క్లబ్ స్థాపకుడు డీన్ R. క్యాంప్‌బెల్ ప్రారంభించిన అంతర్జాతీయ లెఫ్ట్-హ్యాండర్స్ డే 1976లో మొదటిసారిగా నిర్వహించారు. ప్రధానంగా కుడిచేతి వాటం ప్రపంచంలో ఎడమచేతి వాటం కలిగిన వ్యక్తులు ఎదుర్కొనే సవాళ్లు, అనుభవాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ రోజును ఎంపిక చేశారు.
International Left-Handers Day 2023: థీమ్
అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే 2023 థీమ్ గా “Left-Handers in Sports” ఎంపిక చేశారు. ఈ థీమ్ క్రీడల్లో రాణించిన అనేక మంది ఎడమచేతి వాటం క్రీడా ప్రముఖులను గుర్తించి గౌరవిస్తుంది. డియెగో మారడోనా, పీలే, లియోనెల్ మెస్సీ వంటి దిగ్గజాలు ఫుట్‌బాల్ రంగంలో చెప్పుకోదగిన ఎడమచేతి వాటం క్రీడాకారులకు ప్రధాన ఉదాహరణలుగా నిలిచారు. అలాగే మన క్రికెటర్లలో ఎంతో మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతమైన ఆటతీరును కనబరిచి మన మనస్సుల్లో చెరగని ముద్రవేశారు.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.