Zero Interest loans | మహిళలకు గుడ్ న్యూస్.. పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు..
Zero Interest loans : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందిరా క్రాంతి పథకాన్ని(Indira Kranthi Scheme) మార్చి 12న ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి గాను మహిళలకు వడ్డీ లేని రుణాలు (zero interest loans) అందిస్తామని తెలిపారు.
రైతు బంధుపై ఏం చెప్పారంటే..
రైతు బంధు (Rythu Bandhu Scheme) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ బీఆర్ ఎస్ కంటే తక్కువ సమయంలోనే రైతు బంధు సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలు, కొండలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వవద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతు బంధు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామన్నారు. త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి సాయం అందిస్తామని తెలిపారు. అయితే వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇవ్వలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
విద్యుత్ ఛార్జీల (Electricity Charges) గురించి మాట్లాడుతూ.. కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులను నిరర్థక ఆస్తులుగా వదిలేయబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ ఛార్జీలు ఏమాత్రం పెంచబోమని ప్రకటించారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగం పెరిగినా తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ (Solar Power) వినియోగంపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Bagundi