Railways News | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైళ్లలో పెరగనున్న కోచ్‌ల సంఖ్య
Railways News | న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అశ్విని వైష్ణవ్ ఈ క్యాలెండర్ ఇయర్‌కు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వైష్ణవ్ తన బాధ్యతలను స్వీకరించిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కోచ్‌లను పెంచడం ద్వారా రద్దీని తగ్గించాలని నిర్ణయించారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా క్లోన్ రైలు అని పిలువబడే అదనపు రైళ్లను నడపాలని భావిస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. వేసవిలో అత్యధిక ప్రయాణ రద్దీని తగ్గించడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియన్ రైల్వే అదనపు రైళ్లను నడిపించిన విషయం తెలిసిందే.. .
వందే మెట్రోను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని అధికారులు తెలిపారు. “రెండు వందే మెట్రో కోచ్‌ల ఉత్పత్తి పూర్తయింది. ట్రయల్స్ ఏ రోజున ప్రారంభమవుతాయి” అని ఆయన చెప్పారు.
ప్రతిరోజు 250 కి.మీ వరకు ప్రయాణించే ఇంటర్‌సిటీ ప్రయాణీకుల సేవలు అందించేందుకు వందే మెట్రో రైళ్లను తీసుకువస్తున్నారు. ఇది మెట్రో రైలు వలె 12 కోచ్‌లు, సీటింగ్‌లను కలిగి ఉంటుంది. డిమాండ్‌కు అనుగుణంగా 16 కోచ్‌ల వరకు పొడిగించబడవచ్చు.
భద్రతను పెంపొందించే లక్ష్యంతో, ఈ రైళ్లలో కవాచ్ వ్యవస్థను అమర్చారు, ఇది రైలు ప్రమాదాలను నివారించడానికి కీలకమైన చర్య. అంతేకాకుండా, ప్రతి కోచ్‌లో మంటలు, పొగను గుర్తించడానికి సెన్సార్లు అమర్చుతున్నారు. కోచ్‌లలో వీల్‌చైర్-యాక్సెసిబుల్ లావెటరీ కూడా ఉంటుంది.
బుల్లట్ ట్రెయిన్ లో ఆటోమేటెడ్ రెయిన్‌ఫాల్ మానిటరింగ్ సిస్టమ్
మరోవైపు ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా బుల్లెట్ రైలును తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. కొత్త ఈ బుల్లెట్ ట్రైన్ లో ఆటోమేటెడ్ రెయిన్ ఫాల్ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. “#BulletTrain భద్రత కోసం ఆటోమేటెడ్ రెయిన్‌ఫాల్ మానిటరింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నామని ఈ సిస్టమ్ అధునాతన ఇన్‌స్ట్రుమెంటేషన్ సిస్టమ్‌తో కూడిన రెయిన్ గేజ్‌లను ఉపయోగించి వర్షపాతంపై రియల్ టైం డేటాను అందిస్తుంది” అని వైష్ణవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.