
Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువలను గణనీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది.
Navratna status : నవరత్న హోదాతో లాభమేంటి?
కొత్త నవరత్న హోదాతో ఈ రెండు కంపెనీలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో మరింత స్వయంప్రతిపత్తిని లభిస్తుంది. ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది వారి భవిష్యత్ వృద్ధి ప్రణాళికలలో వేగంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుతుంది.
మహారత్న, నవరత్న, మినీరత్న
కేంద్ర ప్రభుత్వం CPSEలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తుంది: మహారత్న(Maharatna), నవరత్న(Navratna), మినీరత్న (Miniratna). ఈ PSUలను మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా తయారు చేయడమే కేంద్రం లక్ష్యం.
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని IRCTC, మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,270.18 కోట్ల వార్షిక టర్నోవర్, రూ.1,111.26 కోట్ల నికర లాభం మరియు రూ.3,229.97 కోట్ల నికర విలువను నివేదించింది.రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఆర్‌ఎఫ్‌సి, ఇదే కాలంలో రూ.26,644 కోట్ల టర్నోవర్, రూ.6,412 కోట్ల నికర లాభం, రూ.49,178 కోట్ల నికర విలువను నమోదు చేసిందని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోని రెండు వేర్వేరు పోస్ట్‌లలో తెలిపింది.
రెండు కంపెనీలను అభినందించిన రైల్వే మంత్రి
తాజా పరిణామంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) ఈ సాధనకు రెండు కంపెనీలను అభినందించారు.”నవరత్న హోదాకు అప్‌గ్రేడ్ అయినందుకు IRCTC జట్టు, IRFC బృందానికి అభినందనలు” అని కేంద్ర మంత్రి Xలో పోస్ట్ చేశారు.
1999లో స్థాపించబడిన IRCTC, ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, పర్యాటక సేవలను అందిస్తుంది. వినియోగదారులతో ఉన్నత స్థాయి సౌకర్యాలను అందిస్తోంది. 1986లో స్థాపించబడిన IRFC, భారతీయ రైల్వేల భారీ మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ ప్రాజెక్టులకు నిధులను సమీకరించే బాధ్యతను నిర్వర్తిస్తోంది.
ఈ అప్‌గ్రేడ్‌తో, IRCTC, IRFC లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ వంటి ఇతర నవరత్న (Navratna status) CPSEల జాబితాలో చేరాయి. గతంలో సెప్టెంబర్‌లో సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్, రైల్‌టెల్ కార్పొరేషన్‌లను ‘నవరత్న’ హోదాకు పెంచారు. జూలై 2024లో, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌ను నవరత్న కంపెనీల సమూహంలో చేర్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.