Thursday, March 27Welcome to Vandebhaarath

Sambhal Case : షాహీ జామా మసీదు కేసుపై అలహాబాద్ హైకోర్టులో నేడు విచారణ

Spread the love

Sambhal Case : సంభాల్‌లోని షాహి జామా మసీదుకు సంబంధించిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) మంగళవారం విచారించనుంది. దేశ వాప్తంగా అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఈ కేసును జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉదయం 10 గంటలకు విచారించనుంది.

కొన్ని నెల‌లుగా తీవ్ర చర్చకు దారితీసిన సంభాల్ మ‌సీదు (Jama Masjid) ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి అనుమతి కోరుతూ మసీదు నిర్వహణ కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు జరిగే విచారణ సందర్భంగా, భారత పురావస్తు సర్వే (ASI) బృందం మసీదు పరిశుభ్రతపై నివేదికను సమర్పిస్తుంది. మసీదును పరిశీలించి దాని పరిశుభ్రతను నిర్ధారించాలని కోర్టు గతంలో ASIని ఆదేశించింది. ASI నివేదికకు ప్రతిస్పందనగా మసీదు కమిటీ ప్రతినిధులు సమాధాన‌విమ‌వ్వ‌నున్నారు.

READ MORE  Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..

మసీదు నిర్వహణ కమిటీ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, శుక్రవారం కోర్టు (Allahabad High Court) షాహి జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ASIని ఆదేశిస్తూ ఒక ఆదేశం జారీ చేసింది, కానీ రంజాన్ కు ముందు మసీదుకు వైట్ పెయింటింగ్ చేయాలని ఆదేశించడంలో విఫలమైంది. మసీదును తనిఖీ చేసి, వారి పరిశోధన ఫలితాలను సమర్పించడానికి ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించాలని కూడా కోర్టు ASIని ఆదేశించింది.

ఈ కేసు చట్టపరమైన, చారిత్రక, మతపరమైన వివాదాల‌కు కేంద్ర బిందువుగా ఉంది. చారిత్రాత్మక హరిహర ఆలయాన్ని( Harihar temple) కూల్చివేసిన తర్వాత షాహి జామా మసీదు నిర్మించార‌ని హిందూ సంఘాలు వాదిస్తున్న విష‌యం తెలిసిదే.. 2024, నవంబర్ 2న సంభాల్‌ (Sambhal) మసీదును స‌ర్వే చేయాల‌ని అల‌హాబాద్ కోర్టు సర్వేకు ఆదేశించ‌డంతో మసీదు మూలాల చుట్టూ ఉన్న వివాదం మరింత పెరిగింది. ఈ సర్వే హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఇందులో నలుగురు చ‌నిపోయారు. సున్నితమైన మతపరమైన, చారిత్రక వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.

READ MORE  Bajaj Ledz Inverter Lamp : కరెంటు పోయినా 4 గంటలు వెలుగుతుంది..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *