హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…

హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకతల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చేసింది…

హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వారధులను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన (Steel Bridge) శనివారం అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్‌ శనివారం ఉదయం ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమ నేత, కార్మిక నాయకుడు, మాజీ మంత్రి అయిన నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం ఈ వంతెనకు ఆయన పేరు పెట్టారు. ఇందిరా పార్క్‌ చౌరస్తా (Indira Park) నుంచి ఆర్టీసీ బస్‌ భవన్ సమీపంలోని వీఎస్టీ చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఫలితంగా ఆర్టీసీ క్రాస్‌రో డ్స్‌, అశోక నగర్‌, వీఎస్టీ (VST) జంక్షన్ల ప్రాంతంలో ఏర్పడే ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

READ MORE  Indian Railways | నాగ్ పూర్ - సికింద్రాబాద్ వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ లో 20 కోచ్ లు, 1,440 సీట్లు

ఎన్నో ప్రత్యేకతలు

  • దక్షిణ భారత దేశంలోనే ఇది మొదటి పొడవైన స్టీల్‌ బ్రిడ్జ్‌.
  • జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి మరో ప్రత్యేకత ఉంది. మొదటిసారి భూ సేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో లైన్ పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో స్పెషాలిటీ.
  • ఈబ్రిడ్జి పొడవు 2.62కిలో మీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు
  • ఈ వంతెన కోసం సుమారు 12, 316 మెట్రిక్‌ టన్నుల ఉక్కును వినియోగించారు.
  • 81 స్టీల్‌ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలను ఉపయోగించారు.
  • కాంక్రీట్‌ 60-100 ఏళ్లు, స్టీల్‌100 సంవత్సరాలకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
  • స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద (ఎస్‌ఆర్‌డీపీ) రూ.450కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది.
  • రోజుకు లక్ష వాహనాలకు పైగా తిరిగే ఈ రూట్‌లో వాహనదారులకు రద్దీ టైంలో 30-40 నిమిషాల సమయం పట్టేది. అయితే ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ప్రయాణం కొనసాగించవచ్చని అధికారులు చెబుతున్నారు.
READ MORE  Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ (Minister KTR) మాట్లాడుతూ.. ‘ఈ స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాం. ఈ వంతెన నిర్మాణంతో ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయి. ఎస్‌ఆర్‌డీపీ లో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం.’ అని మంత్రికేటీఆర్ పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *