చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు తన ప్రతిభతో అద్భుతమైన కళారూపాన్ని తయారు చేశాడు. ఈ చేనేత కార్మికుడు జి20 సదస్సులో దేశాధినేతల చిత్రాలు, భారతీయ చిహ్నాన్ని రెండు మీటర్ల పొడవు గల వస్త్రంపై చూడచక్కగా నేశాడు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు (sircilla handloom worker) వెల్ది హరి ప్రసాద్ దేశ విదేశాలకు చెందిన G20 నాయకులను రెండు మీటర్ల క్లాత్ పై నేయడం ద్వారా తన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఫాబ్రిక్ పై భారతీయ చిహ్నం, జీ20 లోగోను కూడా చూపుతుంది. హరి ప్రసాద్ రెండు మీటర్ల పొడవు వస్త్రం పూర్తి చేయడానికి అతనికి వారం రోజులు పట్టింది. ఈ కళాఖండంలో PM మోడీ, హిందీ ఫాంట్‌లో అల్లిన ‘నమస్తే’ అని రాసి ఉన్నాయి. ప్రసాద్ తన కళాఖండాన్ని ప్రధానితో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఇదిలా ఉండగా గత సంవత్సరం, జీ20 లోగోను కూడా తయారు చేసి ప్రధాని మోదీకి పంపాడు. ఈ విషక్ష్ాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన రేడియో షో అయిన మన్ కీ బాత్ లో ప్రస్తావించాడు. హరి గతంలో అగ్గిపెట్టలో పట్టేంత సన్నని చీర, నేతన్నసిరిపట్టు, దబ్బనంలో దూరే చీరను తయారు చేసి అందరనీ అబ్బురపరిచాడు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.