Metro Phase – 2 | హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణలో కొత్త రూట్లు ఇవే..
Metro Phase – 2 | హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులతో నిత్యం సతమతమవుతున్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త మార్గాల ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II విస్తరణ కొత్త మార్గాలు ఈ వ్యూహాత్మక విస్తరణ హైదరాబాద్‌లోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైల్ సేవలను అందించడంతోపాటు నగరం నాలుగు మూలల నుంచి విమానాశ్రయాన్ని కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టున్నారు.
గత ప్రతిపాదనలు రద్దు..
గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ మార్గాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగర జనాభాలో ఎక్కువ మంది ప్రజల అవసరాలను తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రత్యామ్నాయ మార్గాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేయనుంది. కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ 15 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, 45 శాతం రుణం FRBM, 5 శాతం PPP మోడల్ లో నిర్మించాలని ప్రతిపాదించారు..
కొత్తగా కనెక్టివిటీ లక్ష్యం ఇదీ..
తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు ప్రజా రవాణాను అందించడమే కొత్త మెట్రో రైలు కనెక్టివిటీ ప్రాథమిక లక్ష్యం.. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు మూడు కారిడార్లలో 69 కి.మీగా ఉంది. అయితే ఫేజ్-II కింద, హైదరాబాద్ మెట్రో మొత్తం 78 కి.మీ విస్తరించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
దశ-II విస్తరణ ముఖ్యాంశాలు
1. సికింద్రాబాద్-జూబ్లీ బస్ స్టేషన్‌ను MGBS వరకు పొడిగింపు: సికింద్రాబాద్-జూబ్లీ బస్ స్టేషన్ మధ్య మెట్రో రైలు నెట్‌వర్క్‌ను MGBS వరకు చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు పొడిగించనున్నారు, ఈ కీలకమైన కారిడార్‌లో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
2. నాలుగు కొత్త కారిడార్లు
కారిడార్ 2: MGBS మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు (5.5 కి.మీ); ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ (1.5 కి.మీ)
కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ వరకు, ఒవైసీ ఆసుపత్రిని చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, పి 7 రోడ్డు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కలుపుతుంది (మొత్తం 29 కి.మీ); మైలార్‌దేవ్‌పల్లి నుండి రాజేంద్రనగర్‌లో ప్రతిపాదిత హైకోర్టుకు ఆరామ్‌ఘర్ (4 కి.మీ) మీదుగా ఈ మార్గం ఉండనుంది.
కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్ మరియు US కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) (8 కి.మీ)
కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి భేల్ మీదుగా పటాన్ చెరు (14 కి.మీ )
కారిడార్ 7: ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ (8 కి.మీ)
హైదరాబాద్ మెట్రో రైలు దశ-II విస్తరణలో భాగంగా సికింద్రాబాద్-జూబ్లీ బస్ స్టేషన్ నుంచి MGBS వరకు కొత్త మార్గాన్ని చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు విస్తరించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
Metro Phase – 2 విస్తరణ : కీలక అంశాలు
చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ చేరిక: మెట్రో రైలు నెట్‌వర్క్ చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్‌కు మార్గాన్ని విస్తరించి, ఈ కీలకమైన కారిడార్‌లో కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుంది.
నాలుగు కొత్త కారిడార్‌ల పరిచయం: కారిడార్ 2: MGBS నుండి ఫలక్‌నుమా (5.5 కి.మీ)
MGBS మెట్రో స్టేషన్ నుండి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ.
చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్ వరకు అదనంగా 1.5 కి.మీ.
కారిడార్ 4: నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం (29 కి.మీ)
నాగోల్ మెట్రో స్టేషన్‌ను ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్‌కు కలుపుతుంది.
చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, P7 రోడ్‌ను చుట్టి, శంషాబాద్ విమానాశ్రయం వద్ద ముగుస్తుంది.
మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరామ్‌ఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లోని ప్రతిపాదిత హైకోర్టు వరకు 4 కి.మీ.
కారిడార్ 5: రాయదుర్గ్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (8 కి.మీ)
రాయదుర్గ్ మెట్రో స్టేషన్‌ని బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, US కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్)కి 8 కి.మీ వరకు విస్తరించి ఉంది.
కారిడార్ 6: మియాపూర్ నుంచి పటాన్ చెరు (14 km)
మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్‌ఈఎల్ ద్వారా పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ
కారిడార్ 7: ఎల్‌బి నగర్ నుంచి హయత్‌నగర్ ..(8 కి.మీ)
ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మరియు హయత్‌నగర్ వరకు 8 కి.మీ దూరం విస్తరించి ఉంది.
ఈ మెట్రో ఫేజ్-II విస్తరణ అవాంతరాలు లేని రవాణా సౌకర్యంకల్పించడమే కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహనం చేయనుంది. ఈ కొత్త మార్గాలు నగరం వ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీ యాక్సెసిబిలిటీ తీసుకొస్తాయి. ఫేజ్-II విస్తరణ మార్గాల ఖరారు చేయడం వల్ల హైదరాబాద్‌లో పటిష్టమైన సమగ్రమైన మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను రూపొందించే కీలకమైన దిశగా భావించవచ్చు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..