508 కిలోమీటర్లు.. ఆరు వరుసలు.. హైదరాబాద్-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే
Hyderabad Bengaluru Highway | తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్త హైదరాబాద్, బెంగళూరు మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలకు తగినట్లుగా కొత్తగా మరొక జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల జాతీయ రహదారి ఉంది. దీని తోడుగ మరొక కొత్త నేషనల్ హైవేను నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్-2047 లో భాగంగా ఈ హైవేను నిర్మించనున్నారు. ఈ రహదారితో నాగ్‌పుర్ – హైదరాబాద్ – బెంగళూరు నగరాల మధ్య ప్రజలు, సరుకు రవాణా మెరుగుపరచాలని మోదీ ప్రభుత్వం రంఎడు సంవత్సరాల క్రితమే నిర్ణయించింది. కొత్త హైవే నిర్మాణంతో ప్రయాణ సమయం ఆదా అవుతుదంఇ. నాగ్‌పుర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ రోడ్డును హైదరాబాద్ నుంచి బెంగళూరును కూడా అనుసంధానించాలని కేంద్రం భావించింది. దీనికి సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు – డీపీఆర్)ను రూపొందించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోదంఇ. ఈ మేరకు నివేదిక తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ చివరి గడువుగా నిర్ణయించింది.
నలుగు నుంచి ఆరు వరుసలుగా..
దక్షిణ భారతంలో రెండు మహా నగరాల మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త రహదారిని ఆరు వరుసల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. మొదట 12 వరుసల రహదారిని నిర్మించాలని ప్రతిపాదనలు చేయగా ప్రస్తుతానికి ఆరు వరుసలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవే హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి (Green Field Highway) గా నిర్మించాలని నిర్ణయించారు. ఏకంగా 120 కి.మీ. వేగంతో వాహనాలు ప్రయాణించేందకు వీలుగా దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ జాతీయ రహదారి నిర్మాణం 508.461 కిలోమీటర్లు ఉంది. 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కి.మీ మేర నాలుగు వరుసల హైవే అందుబాటులో ఉంది. తెలంగాణలో 190 కి.మీ ఆంధ్రప్రదేశ్‌లో 260 కి.మీ, కర్ణాటకలో 106 కిలోమీటర్ల ల వరకు విస్తరించింది.
Hyderabad Bengaluru Highway : రోజురోజుకు విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రహదారి ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలోనే 2022లోనే దీనిని ఆరు వరుసలకు విస్తరించాలని నిర్ణయించి డీపీఆర్‌ను కూడా రూపొందించింది. కానీ పలు కారణాల వల్ల ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు. తాజాగా అత్యాధుని హంగులతో హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌ను నిర్మించాలని మంత్రిత్వ శాఖ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..