
Group 1 Mains Hall Tickets | TGPSC గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామని, అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.
ఇక గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించగా 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి.
పరీక్షల షెడ్యూల్
- 21న జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ )
- 22న పేపర్-1 (జనరల్ ఎస్‌ఏ)
- 23న పేపర్-2 (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
- 24న పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్)
- 25న పేపర్ -4 (ఎకానమీ, డెవలప్మెంట్)
- 26న పేపర్- 5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇన్టర్ప్రెటేషన్
- 27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..