Thursday, March 6Thank you for visiting

Graduate MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

Spread the love

Graduate MLC Elections : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా నిర్విరామంగా ఓట్ల లెక్కింపు జరగగా రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు. కాగా ఈవిషయాన్ని కాసేపట్లో అధికారులు అధికారిక ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో నిలిచారు. ఒక వైపు కౌంటింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది.

READ MORE  l&t Metro Hyderabad | హైదరాబాద్ మెట్రోలో అసలేం జరుగుతోంది..!

Karimnagar Graduate MLC Elections : ఇదిలా ఉండగా కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించడంతో ఇప్పిటకే బిజెపి దళం మంచి ఊపుమీద ఉంది. తాజాగా పట్టభ్రదుల కోటాలోనూ కాషాయ పార్టీ గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. చారు. టీచర్స్ కోటాలో మొత్తం 25,041 ఓట్లు రాగా అందులో 897 వోట్లు చెల్లనివిగా తేల్చారు. మొత్తం చెల్లుబాటైన 24,144 ఓట్లలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు లభించాయి. ఇక పీఆర్‌టీయూ అభ్యర్థి మహేందర్ రెడ్డి 7,182 ఓట్లతో రెండో స్థానంలో నిలవగా అశోక్‌ కుమార్‌కు 2,621 ఓట్లు సాధించారు.

READ MORE  Highway Roads | తెలంగాణలో సరికొత్త మోడల్ లో రహదారుల అభివృద్ధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు Adiyogi : ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం విశేషాలివే..