Bharat Rice | రూ. 29కి బియ్యం విక్రయం.. రేపటి నుంచి మార్కెట్‌లోకి భారత్ రైస్
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బియ్యం లభ్యతను పెంచి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యాన్ని కేవలం రూ. 29కి విక్రయించాలని నిర్ణయించింది. ఈ సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎఫ్) కేంద్రియ భండార్ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు తెలుస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి
Bharat Rice పై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ పిండి, పప్పు ధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో తక్కువ ధరలకే పంపిణీ చేస్తోంది. నవంబర్‌లో తృణధాన్యాల ధరలు పది శాతం పైగా ఎగబాకడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి పెరిగింది.
Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..