
Sim Cards | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గత 90 రోజుల్లో 71,000 కంటే ఎక్కువ సిమ్ కార్డుల(SIM cards)ను టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT – Department Of Telecommunication ) బ్లాక్ చేసింది. ఈ సిమ్ కార్డులు మోసపూరిత మార్గాల ద్వారా జారీ అయ్యాయని, ప్రధానంగా మోసాలకు ఉపయోగించారని నివేదికలు చెబుతున్నాయి. చాలా వరకు మోసగాళ్ళు తప్పుడు గుర్తింపు కార్డులతో ఈ సిమ్ కార్డులను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేరస్థులు పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లను ఉపయోగించి అక్రమంగా సిమ్ కార్డులను పొందారని అధికారులు చెబుతున్నారు. ఈ కార్డులను కొనుగోలు చేయడానికి నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించారని, వ్యక్తుల నుంచి కోట్లాది రూపాయలను మోసం చేశారని వెల్లడించారు.
సంచార్ సాథీ పోర్టల్, వెబ్‌సైట్ ద్వారా లేదా 1930కి కాల్ చేయడం ద్వారా సిమ్ సంబంధిత మోసాలను అరికట్టడానికి సహాయపడాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. అధికారుల ప్రకారం, బాధితులు ముందుకు రాకపోతే, మోసగాళ్ళు తమ మోసపూరిత వ్యూహాలను ఇంకా పెంచుకుంటూ వెళ్తారని తెలిపారు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవడానికి, మరిన్ని మోసాలుజరగకుండా చెక్ పెట్టడానికి ఇటువంటి సంఘటనలను నివేదించడం చాలా ముఖ్యం.
సిమ్ మోసాన్ని ట్రాక్ చేయడానికి, పరిష్కరించడానికి వారు ఉపయోగించే వివిధ సాధనాలను కూడా DoT అధికారులు హైలైట్ చేశారు. అటువంటి సాధనాలలో ఒకటి ASTR అని పిలువబడే టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ కోసం AI, ఫేస్ రికగ్నేషన్ సొల్యూషన్. ఈ వ్యవస్థ సిమ్ కార్డ్ వినియోగదారుల రికార్డులను నిర్వహిస్తుంది. వివిధ చిరునామాలు, పేర్లతో ఒక వ్యక్తి పొందిన ఎక్కువ సిమ్ కార్డులను గుర్తించగలదు. ఈ సాంకేతికత కారణంగానే అనేక మోసపూరిత సిమ్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి.
Sim Cards Rules : మీ సిమ్ కార్డులను బదిలీ చేయవద్దు.
సిమ్ కార్డులను బదిలీ చేయడానికి వీల్లేదని, అంటే వారి పేరుతో సిమ్ పొందిన వ్యక్తి .. దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అధికారులు హెచ్చరించారు. సిమ్ ను తెలియనివారికి ఇవ్వొద్దని చెప్పారు. అక్రమంగా సిమ్ కార్డులను సేకరించడం నేరానికి బెయిల్ కూడా లభించదని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.