Saturday, May 10Welcome to Vandebhaarath

Yadagirigutta Temple | జూన్ 18 నుంచి యాద‌గిరి గుట్ట‌ చుట్టూ గిరి ప్ర‌ద‌ర్శ‌న‌

Spread the love

Yadagirigutta Temple | హైదరాబాద్: యాదాద్రిలో జూన్ 18వ తేదీ నుంచి ప్రతిరోజూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులను అనుమతించ‌నున్నారు. ప్ర‌సిద్ధ‌ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడులోని అరుణాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని సింహాచలం తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జూన్ 18 నుంచి గిరి ప్రదక్షిణ నిర్వహించేందుకు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గిరి ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 18న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామ‌ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్‌రావు ధ్రువీకరించారు.

గిరి ప్ర‌ద‌ర్శ‌తో భ‌క్తుల సంకీర్త‌న‌లతో ఆల‌య ప‌రిసరాలు ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం వెల్లివిర‌య‌నుంది. అయితే ”గిరి ప్రదక్షిణ”ను ప్రవేశపెట్టిన తెలంగాణలో మొట్టమొదటి ఆలయంగా యాదాద్రి దేవస్థానం నిలవనుంది. జూన్ 18న 4,000 మంది భక్తులతో ధార్మిక కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నామ‌ని ఆల‌య ప్ర‌తినిధులు తెలిపారు.

READ MORE  Self Help Groups | మహిళలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్..

ప్రతి మంగళవారం ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు గర్భగుడి నుంచి స్థానిక గ్రామస్తులు (అంతరాయల) స్వామిని ప్రత్యేక దర్శనానికి అనుమతించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు, ప్రతి శనివారం ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు మరో దర్శన సౌకర్యం కల్పించారు. దీంతో ప్రత్యేక దర్శనం కల్పించాలన్న స్థానిక గ్రామస్తుల చిరకాల డిమాండ్‌ను యాజమాన్యం నెరవేర్చింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు సంబంధిత అధికారులతో సమావేశమై అంద‌రి అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

READ MORE  RTC JAC | తెలంగాణలో మళ్లీ ఆర్టీసీ సమ్మె సైరన్.. నోటీసులు జారీ..!

జూలై 15 నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి

Dress code in Yadagirigutta Temple : జూన్ 15 నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. ఆలయం లో ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులందరికీ నిర్వాహకులు డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంద‌ని సూచించారు. “మేము ఇప్పటికే డ్రెస్ కోడ్‌ని అమలు చేయడం ప్రారంభించామ‌ని, మహిళలకు సాంప్రదాయ చీర లేదా ‘సల్వార్ కమీజ్‌, పురుషులకు ‘ధోతీస‌, ‘కుర్తాస ధ‌రించాల‌ని సూచించామ‌ని ఆల‌య అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా జూన్ 1 అమ‌లు చేస్తుండ‌గా అద్భుతమైన స్పందన రావడంతో జూన్ 15 నుంచి దీన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించుకున్నాం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజు సగటున 5,000 నుండి 8,000 మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని, వారాంతాల్లో ప్రభుత్వ సెలవు దినాల్లో, భ‌క్తుల‌ 50,000 దాటుతుంద‌ని వెల్ల‌డించారు. భక్తులు  ప్ర‌త్యేక పూజలుస‌, స్వామివారి కల్యాణం’, ‘లక్ష తులసి పూజలు’, అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు.

READ MORE  SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..