రేపటి నుంచి గాంధీ చిత్ర ప్రదర్శన
హనుమకొండ : భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు హన్మకొండ జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మా గాంధీ చలనచిత్రాన్ని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. 2022లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు గాంధీ చిత్రాన్ని (Gandhi movie) ప్రదర్శించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్లి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఉచితంగా సినిమా ప్రదర్శనను నిర్వహించనున్నారు. విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా చిత్రాన్ని చూసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు14వ తేదీ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని 15వ తేదీ ఇండిపెండెన్స్ డే, 20వ తేదీ ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదు. 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుంది.
జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో థియేటర్ల నిర్వాహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ, పోలీసు శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్ర ప్రదర్శన నిర్వహించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
హన్మకొబడ జిల్లాలో గాంధీ సినిమా ప్రదర్శించే థియేటర్లు ఇవే..
1. ఏషియన్ శ్రీదేవి మాల్ స్క్రీన్ -2,
2. ఏషియన్ శ్రీదేవి మాల్ స్క్రీన్ -3,
3. మినీ భవాని, కాజిపేట్
4. ఏషియన్ శ్రీదేవి మాల్ స్క్రీన్ -1.
5. భవాని 70mm థియేటర్ కాజిపేట్.
6. అశోక
7. అమృత 70mm
8. యూయండబ్లూ -సారథి కళామందిర్ ( కమలాపూర్ ) ఈ థియేటర్స్ లలో చిత్ర ప్రదర్శన ఉంటుంది.