
EPFO Update | ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రైబర్‌లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే సంవత్సరం నుంచి EPFO చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్‌లను నేరుగా ATMల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా బుధవారం ఈ పెద్ద ప్రకటన చేశారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ.. “మేము క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరిస్తున్నాం, చందాదారుల మెరుగైన, సత్వర సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాము. ఒక క్లెయిమ్‌దారు, లబ్ధిదారుడు లేదా బీమా చేయబడిన వ్యక్తి ATMల ద్వారా సౌకర్యవంతంగా తమ క్లెయిమ్‌లను పొందగలరు ” అని లేబర్ సెక్రటరీ సుమితా దావ్రా చెప్పారు.
మేము ఈపీఎఫ్ లో టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేస్తున్నామమని, ఈపీఎఫ్ క్లెయిమ్‌ల వేగం, ఆటో-సెటిల్‌మెంట్ పెరిగిందని, అనవసరమైన ప్రక్రియలను తొలగించామని తెలిపారు. మా EPFO లోని IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మన బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయికి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తాము EPFOలో IT 2.1 వెర్షన్ జనవరి 2025లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు సమూల మార్పులు చూస్తారని చెప్పారు. క్లెయిమ్‌లు, లబ్ధిదారులు లేదా బీమా చేయబడిన వ్యక్తులు నేరుగా ATMల ద్వారా క్లెయిమ్‌లను విత్‌డ్రా చేసుకోవచ్చు” అని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో 70 మిలియన్లకు పైగా క్రియాశీల చందాదారులు ఉన్నారని వీరికోసం అనేక అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 2017లో నిరుద్యోగిత రేటు ఆరు శాతం ఉండగా.. నేడు అది 3.2 శాతానికి తగ్గిందని ఆమె చెప్పారు.
EPFO నుండి ఉపసంహరణ నియమాలు
EPFO Update ఉద్యోగంలో ఉన్నప్పుడు పాక్షికంగా లేదా పూర్తిగా PF నిధులను డ్రా చేసుకోవడానికి అనుమతి లేదు. మీరు కనీసం ఒక నెలపాటు నిరుద్యోగిగా ఉన్నట్లయితే, మీరు మీ PF బ్యాలెన్స్‌లో 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు నెలల నిరుద్యోగం తర్వాత, మీరు మొత్తం బ్యాలెన్స్‌ను ఉపసంహరించుకోవడానికి అర్హులు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..