Friday, January 23Thank you for visiting

Elections

Elections, #Results #Elections Results Assembly, Parliament,

Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?

Lok Sabha elections 2024: వారణాసిలో ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నహాస్యనటుడు శ్యామ్ రంగీలా ఎవరు?

Elections
Shyam Rangeela | ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేసి పాపుల‌ర్ అయిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్ల‌డించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి జూన్ 1న లోక్‌సభ ఎన్నికల్లో ఏడవ దశలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. రంగీలా లోక్‌సభ 2024కి వారణాసి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు బుధవారం సోషల్ మీడియాలో ప్రకటించారు . కాగా 2014, 2019లో రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న మోదీ , మే 13న వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. శ్యామ్ రంగీలా ఎవరు? రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి పెరిగిన రంగీలా (Shyam Rangeela) యానిమేషన్ కోర్సు పూర్తిచేశారు. రంగీలా తన మిమిక్రీ తో బాగా పాల‌పుల‌ర్ అయ్యారు. ముఖ్యంగా రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేస్తూ . 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'లో తన ప్రదర్శనలతో క...
Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు

Elections
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) త‌మ‌కు ఓటు వేయ‌కుంటే క‌రెంట్ క‌ట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ స‌ర‌ఫ‌రా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేద‌ని తన వ్యాఖ్య‌ల‌కు కట్టుబడి ఉంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గ ప‌రిధిలోని జుగులాటోలో జరిగిన బహిరంగ సభలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్‌కు వోటేసి, చిక్కోడి లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదేశాలు జారీచేశారు. అలా జరగ‌కుంటే ఏకంగా మీ గ్రామానికి కరెంట్‌ కట్‌ చేయిస్తానని హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ (BJP) మండిప‌డింది. కాం...
Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

Elections
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది.EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్లలో తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పా...
Delhi Congress Leaders Quit Party | ఢిల్లీ కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఆప్ తో పొత్తు కార‌ణంగా పార్టీని వీడిన సీనియ‌ర్లు

Delhi Congress Leaders Quit Party | ఢిల్లీ కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్‌.. ఆప్ తో పొత్తు కార‌ణంగా పార్టీని వీడిన సీనియ‌ర్లు

Elections
Delhi Congress Leaders Quit Party | ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఇద్ద‌రు పార్టీ సీనియ‌ర్లు నీరజ్‌ బసోయా, నసీబ్‌ సింగ్‌లు కాంగ్రెస్ ను వీడారు. ఈ ఇద్దరు నేతలు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన వేర్వేరు లేఖ అందించారు. అవినీతిలో కూరుకుపోయిన ఆప్ తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవ‌డం తాము జీర్ణించుకోలేక‌పోతున్నామని లేఖ‌లో పేర్కొన్నారు.పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు నీరజ్ బసోయా మాట్లాడుతూ “ఢిల్లీలో ఆప్‌తో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు బాధపడుతున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు రోజురోజుకూ పెద్ద చెడ్డపేరు తెచ్చిపెడుతోంది. ఆత్మగౌరవం ఉన్న పార్టీ నాయకుడిగా నేను ఇకపై పార్టీతో ఉండలేనని అన్నారు. తాను పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. . గత 30 ఏళ్లలో నాలాంటి సామాన్య...
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Elections
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Elections
Rae Bareli : కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోట‌లుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్య‌ర్థ‌ల ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంది పార్టీ నాయ‌కత్వం. ఈ కీల‌క‌మైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా ప...
Indore | కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఇండోర్‌ అభ్యర్థి..

Indore | కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. నామినేషన్‌ ఉపసంహరించుకున్న ఇండోర్‌ అభ్యర్థి..

Elections
Indore | లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి (Congress) వరుసగా గట్టి షాక్ లు తగులుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ లోక్ సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బాబ్‌ (Akshay Kanti Bamb) తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా ఆయన బీజేపీలో చేరిపోయారు.  ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ మంత్రి విజయ్‌ వర్గియ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఇండోర్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతిని బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నట్లుఆయన పేర్కొన్నారు. అక్షయ్‌ తనతో ఉన్న ఫొటోను  ట్యాగ్‌ చేశారు. కాగా ఇండోర్ లో నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న ఓటింగ్ జరగనుంది. సోమవారంమే నామినేషన్ల చివరి రోజు.కాగా కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ సహా ముగ్గురు అభ్యర్థులు ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ విలేకరులతో అన్నారు. అక్షయ్ బామ్ తన అభ్యర్థిత్వాన్...
ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో :  ఎఫ్ఐఆర్ నమోదు

ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు

Elections, National
Amit Shah Doctored Video | న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన‌ట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఫేక్ వీడియోను స‌ర్క్యులేట్ చేసిన‌వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు చేసింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ (BJP ) ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు వ్యాఖ్య‌ల‌ను వక్రీకరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మార్చార‌ని బీజేపీ ఆరోపించింది. బీజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. కాంగ్రెస్ X ఖాతాను బ్లాక్ చేసి దర్యాప్తు  ప్రారంభించాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం అధికారిని కోరింద...
కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

Elections, National
Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాల...
SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

Elections, National
Amit Shah | ల‌క్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..  ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌సింగ్‌కు మద్దతుగా నిర్వ‌హించిన ర్యాలీలో అమిత్‌ షా, కాంగ్రెస్‌ను 'అబద్ధాల ఫ్యాక్టరీ' అని అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.       రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అమ‌లు చేస్తుంద‌న్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రెండు పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీ ఉందని, కానీ నరేంద్ర మోడీ (PM Modi) రిజర్వేషన్‌కు మద్దతు తెలిపార‌ని గుర్తుచేశారు. రిజ‌ర్వేష‌న్ల‌ను బీజేపీ రద్దు చేయదన...