Drug Therapy | డ్రగ్స్ థెరపీతో మధుమేహానికి చెక్.. ఆసక్తిరేపుతున్న కొత్త పరిశోధన
Drug Therapy For Diabetes | ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతిరోజు ఇన్సులిన్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే వీరి కష్టాలను దూరం చేసేందుకు క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను పునరుత్తేజితం చేసే వినూత్నమైన డ్రగ్ థెరపీని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకల్లో చేసిన తాజా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను ఈ డ్రగ్‌థెరపీతో 700 శాతం మేర యాక్టివేట్ చేశామని పరిశోధకులు వెల్లడించారు. సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, డ్రగ్ థెరపీ ఇన్సులిన్-ఉత్పత్తి చేసే కణాలను కేవలం మూడు నెలల్లో 700% పెంచుతుందని, వారి వ్యాధిని సమర్థవంతంగా తిప్పికొడుతుందని వెల్లడించింది.
రక్తంలోని చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే, వీటి పనితీరు మందగించినప్పుడు లేదా ఈ కణాలు నశించిపోయిపుడు శరీరంలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు మొదలవుతాయి. దీన్ని నివారించడానికి బయటి నుంచి ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. అయితే, ఈ ఇంజక్షన్లకు చెక్ పెడుతూ నిర్జీవంగా మారిన లేదా పనిచేయకుండా ఉన్న బీటా కణాలను మళ్లీ యాక్టివేట్ చేసేందుకు అత్యంత కీలకమైన డ్రగ్ థెరపీని మౌంట్ సినాయీ, సిటీ ఆఫ్ హోప్ సంస్థల వైద్య నిపుణులు అభివృద్ధి చేశారు.
‘ఫంక్షనల్ డయాబెటిస్ క్యూర్’ గా పిలిచే ఈ డ్రగ్ థెరపీ సాయంతో నిర్జీవంగా మారిన బీటా కణాలను కేవలం మూడు నెలల్లోనే ఉత్తేజితం చేయవచ్చని తెలిపారు. అంతే కాకుండా నిర్జీవంగా ఉన్న బీటా కణాల స్థానంలో కొత్త కణాలను కూడా ఉత్పత్తి చేయవచ్చని కూడా పేర్కొన్నారు. ఇందు కోసం మూల కణాల సాయాన్ని తీసుకొంటామని పేర్కొన్నారు. డ్రగ్ థెరపీ (Drug Therapy) లో సహజసిద్ధంగా దొరికే హార్మైన్, పీఎల్‌పీ1 వంటి ఔషధాలను వినియోగించినట్లు వివరించారు.
ఈ పరిశోధన భవిష్యత్తులో పునరుత్పత్తి చికిత్సల కోసం ఆశను తెస్తుందని, ఇది మిలియన్ల మంది మధుమేహ రోగులకు చికిత్స చేయగలదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..