New Railway Line : తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ పట్టణాలకు రైలు కనెక్టివిటీ
New Railway Line : తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. పాత స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్తగా స్టేషన్లను కూడా నిర్మిస్తోంది.. ఈ క్రమంలోనే తెలంగాణ వాసుల చిరకాల వాంఛను రైల్వేశాఖ నెరవేర్చబోతోంది.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్తగా డోర్నకల్ నుంచి గద్వాల వరకు రైల్వేలైను నిర్మించనుంది. ఈ .. ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్ సర్వే పనులు ప్రారంభమాయ్యాయి.
మొత్తం 290 కి.మీ
గత సంవత్సరం సెప్టెంబరులో ఫైనల్ లొకేషన్ సర్వే (FLS) మంజూరు చేసింది రైల్వే శాఖ. ఈ మార్గం మొత్తం నిడివి 296 కి.మీ ఉంటుంది. ప్రాథమిక అంచనా వ్యయం రూ.5,300 కోట్లు. రైల్వే శాఖ గత సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 15 కొత్త రైల్వే లైన్లకు తుది సర్వే మంజూరు చేయగా, తెలంగాణకు సంబంధించి డోర్నకల్-గద్వాల వయా సూర్యాపేట మార్గం అందులో ఉంది..
కొత్తగా ఈ పట్టణాలకు రైల్వే లైన్
కొత్తగా నిర్మించనున్న రైల్వే లైన్ New Railway Line ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, పాలేరు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, సూర్యాపేట, నల్గొండ, నాంపల్లి ప్రాంతాలను కవర్ చేస్తుంది. అలాగే
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, భూత్పూర్ పట్టణాల మీదుగా రైల్వేలైన్ వెళ్తుంది.. ఈ రైల్వే లైను అందుబాటులో కి వస్తే తెలంగాణకు అత్యంత కీలకమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట, నాగర్‌కర్నూల్ వంటి జిల్లా కేంద్రాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రయాణికుల కష్టాలు తీరుతాయని పేర్కొంటున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Hyderabad