Doordarshan | సరికొత్త లోగోతో దూరదర్శన్.. పసుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి..
Doordarshan New Logo | భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ అయిన దూరదర్శన్ కొత్త లోగో ఆవిష్కరించారు. న్యూస్ ఛానెల్ DD న్యూస్ లోగోను ఎరుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి మార్చింది. ఈ కొత్త లోగో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. లోగో మారి విలువలు అలాగే ఉన్నాయని అవి ఇప్పుడు కొత్త అవతార్‌లో అందుబాటులో ఉన్నాయని DD న్యూస్ ప్రకటించింది. ”మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.. సరికొత్త DD వార్తలను ఎక్స్ పీరియన్స్ చేయండి. అని దూరదర్శన్ అధికారిక సోషల్ మీడియా పేజీలో వెల్లడంచారు.
దూరదర్శన్ చరిత్ర
దూరదర్శన్ సెప్టెంబర్ 15, 1959న పబ్లిక్ సర్వీస్ టెలికాస్టింగ్‌లో ప్రయోగ్మకంగా ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ప్రయోగం ఒక సేవగా మారింది. ఈ సేవలు 1975 నాటికి ముంబై, అమృత్సర్, ఇతర ఏడు నగరాలకు విస్తరించాయి. ఏప్రిల్ 1, 1976న దూరదర్శన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు వచ్చింది. 1982లో దూరదర్శన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ అయింది. 1982లో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దూరదర్శన్ రంగు వెర్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో 1982 ఆసియా క్రీడల కలర్ టెలికాస్ట్ జరిగింది.
ప్రస్తుతం, దూరదర్శన్ 6 జాతీయ ఛానెల్‌లు, 17 ప్రాంతీయ ఛానెల్‌లను నిర్వహిస్తోంది. జాతీయ ఛానెల్‌లలో DD నేషనల్, DD ఇండియా, DD కిసాన్, DD స్పోర్ట్స్, DD ఉర్దూ, DD భారతి ఉన్నాయి. ఇక మరోవైపు, DD అరుణ్‌ప్రభ, DD బంగ్లా, DD బీహార్, DD చందన, DD గిర్నార్, DD మధ్యప్రదేశ్, DD మలయాళం, DD నార్త్ ఈస్ట్, DD ఒడియా, DD పొధిగై, DD పంజాబీ, DD రాజస్థాన్, DD సహ్యగిరి, DD సప్తగిరి, DD ఉత్తర ప్రదేశ్, DD యాదగిరి, DD కాశీర్ వంటి ప్రాంతీయ ఛానెళ్లు ఉన్నాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..