Posted in

Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

Demolition Drive
Spread the love

Demolition Drive : ఉత్తరప్రదేశ్‌కు చెందిన లిక్కర్ డాన్ పాంటీ చద్దా (Ponty Chadda)కు చెందిన కోట్లాది విలువైన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు కూల్చివేశారు, ఢిల్లీలోని ఛత్రపూర్ ప్రాంతంలో లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ ఫామ్ హౌస్‌ విలువ సుమారు రూ.400 కోట్ల కంటే పైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పాంటీ చద్దా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ ఫామ్‌హౌజ్‌ను నిర్మించినట్లు అధికారులు తేల్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో బుల్ డోజ‌ర్ తో వ‌చ్చి ఫామ్‌హౌస్‌ ను పూర్తిగా కూల్చివేశారు. ప్రస్తుతం ఈ ఫామ్‌హౌజ్‌ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ చద్దా ఆక్ర‌మ‌ణ‌లో ఉంది. ఈ ఫామ్‌హౌస్ లోనే గతంలో పాంటీ చద్దా, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ గ‌ర్ష‌ణ‌ప‌డి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

వీరి మ‌ధ్య‌ గొడవ తీవ్ర‌మై హర్దీప్‌ తన అన్న అయిన‌ పాంటీ చద్దాను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ క్ర‌మంలో పాంటీ అంగరక్షకుడు హర్దీప్‌ను కాల్చేశాడు. తన అన్నదమ్ములిద్దరూ క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొన్నాళ్లుగా ‘ఢిల్లీలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత (Demolition Drive) కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాంటీ చద్దా అలియాస్‌ గురుదీప్‌ సింగ్‌ అక్రమంగా నిర్మించిన ఫామ్‌హౌజ్ ను కూడా కూల్చివేశారు.

ఛత్రపూర్‌లో పది ఎకరాలకుపైగా భూమిలో పాంటీ ఫామ్‌హౌస్ విస్తరించి ఉంది. దీని విలువ రూ.400 కోట్లు ఉంటుంద‌ని డీడీఏ అధికారులు తెలిపారు. శుక్రవారం ఐదెకరాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం ప్రధాన భవనాన్ని కూల్చి మిగిలిన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై చద్దాకు చెందిన వేవ్‌ గ్రూప్ స్పందించలేదు. ఈ సంస్థ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిర్వహిస్తోంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *