Saturday, April 19Welcome to Vandebhaarath

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

Spread the love

DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు.

READ MORE  మెట్రో రైలులో విచక్షణ మరిచి ప్రవర్తించిన జంట.. సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యాప్‌లో నమోదు చేసుకోవాలి. దీనిని మెట్రో ప్రయాణం కోసం ఉపయోగించవచ్చు. అదనపు బోనస్ ఏమిటంటే, MJQRT కోసం ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. వినియోగదారులు UPI, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి గరిష్టంగా రూ. 3,000 బ్యాలెన్స్ పరిమితి

MJQRT ఉపయోగించి ప్రయాణించడానికి కనీస బ్యాలెన్స్ రూ.60 అవసరం ఉంటుంది. MJQRT ప్రయాణీకులకు రద్దీ సమయాల్లో 10% తగ్గింపును అందిస్తుంది (8 AM – 12 PM మరియు 5 PM – 9 PM) ఆఫ్-పీక్ అవర్స్‌లో 20% డిస్కౌంట్ వ‌ర్తిస్తుంది.

READ MORE  Largest Metro Networks : ప్రపంచంలోనే అతిపెద్దదైన మెట్రో రైల్ నెట్ వర్క్.. అతిపెద్ద స్టేషన్ ఏదీ..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *