Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పిడుగు.. ఎన్‌ఐఏ దర్యాప్తునకు సిఫార్సు
Arvind Kejriwal | న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పీకల్లోతు కూరుకుపోయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరో షాక్ తగిలింది. నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు భారీగా నిధులు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi LG VK Saxena) ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సిఫార్సు చేయడం సంచలనం రేపింది. ఎన్ ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోం కార్యదర్శికి లేఖ రాశారు.
అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని AAP ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, అలాగే ఖలిస్తానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి ఖలిస్తానీ గ్రూపుల నుంచి భారీ నిధులు, USD 16 మిలియన్లను పొందినట్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూన్ స్థాపించిన నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు 16 మిలియన్ డాలర్లు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖలో ఆరోపించారు. దీని గురించి పన్నూన్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను జత చేశారు. వెంటనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. మరోవైపు ఇప్పటికే మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ పై మరో పిడుగు పడినట్లైంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..