Friday, April 18Welcome to Vandebhaarath

సీకేఎం కళాశాల ఇక నుంచి సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల

Spread the love
  • కొత్తగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • ఎమ్మెల్యే నరేందర్ ను సన్మానించిన కళాశాల యాజమాన్యం

Warangal: ఆచార్య చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పునేని నరేందర్ కళాశాల యాజమాన్యానికి అందజేశా రు. వరంగల్ తూర్పులోని సీకేఎం కళాశాలను ప్రభుత్వప రం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా సీకేఎం కళాశాలను ప్రభుత్వ కళాశాలగా నామకరణం చేసిన ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆచార్య చందా కాంతయ్య, ప్రొఫెసర్ జయ శంకర్ సర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించా రు. అనం ­తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… కళాశాలలో పనిచేస్తున్న 67 మంది ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. అంతిమంగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్వయంగా తెలిపారన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైనదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ( CM KCR) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి కళాశాల యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సీఎం కేసీఆర్ కు, ఎమ్మెల్యే నరేందర్ కు కృతజ్ఞతలు తెలిపింది.

అయాం.. వెరీ హ్యాపీ.. : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్.. ప్రిన్సిపాల్ గా సేవలందించిన ఈ కళాశాలను(CKM college warangal) సీఎం కేసీఆర్ జీవో 44 తో చారిత్రక నిర్ణయం తీసుకొని సీకేఎం కళాశాలను ప్రభుత్వపరం చేశారు. అంతేకాకుండా కాకుండా ఈ కళాశాలను నేడు చందాకాంతయ్య స్మారక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా నామకరణం చేసి ఉత్తర్వులు అందజేశారని తెలిపారు. తన హయాంలో ఈ కీలక పరిణామం జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.

READ MORE  Indian Railways | ప్రయాణికులకు గుడ్ న్యూస్ | 84 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా నాలుగు జనరల్ కోచ్ లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *