రాస్ట్రంలో త్వ‌ర‌లో ఎయిర్ అంబులెన్స్‌లు..

రాస్ట్రంలో త్వ‌ర‌లో ఎయిర్ అంబులెన్స్‌లు..
Spread the love

వైద్యఆరోగ్యశాఖ మంత్రి హ‌రీశ్‌రావు వెల్లడి

10 ఏండ్ల‌లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం..

ఆరోగ్య సూచీలో 3వ ర్యాంక్‌కు చేరుకున్నాం..

వైద్యారోగ్య శాఖ‌కు రూ. 12,364 కోట్ల బ‌డ్జెట్ పెట్టుకున్నాం..

119 నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌యాల‌సిస్ కేంద్రాలు 

నిమ్స్‌లో ఉచితంగా చిన్న పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు..

హైద‌రాబాద్ : త్వరలో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్సులను (Air Ambulance ) ప్రవేశపెట్టబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా హెలికాప్టర్ ద్వారా వారిని ఆస్పత్రులకు తరలిస్తామని, కేవలం కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను నిరుపేదలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి తెలిపారు. రవీంద్రభారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ 10ఏళ్ల ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు సోమ‌వారం విడుద‌ల చేశారు. ఇదే వేదికపై 310 మంది ఫార్మసిస్టులకు మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌ రావు మాట్లాడుతూ.. నేడు ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి స్వాగతం తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో 105, టీవీవీపీ పరిధిలో ని 135, డీఎంఈ 70 పోస్టులకు మొత్తం 310 మంది ఎంపికయ్యార‌ని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య సూచీలో మనం 3వ ర్యాంక్‌కు చేరుకున్నామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ‌కు రూ. 12,364 కోట్ల బ‌డ్జెట్ పెట్టుకున్నామని తెలిపారు. అలాగే 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో డ‌యాల‌సిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. నిమ్స్‌లో ఉచితంగా చిన్న పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *