ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..
మూతపడిపోతున్న Cafe Coffee day సంస్థను నిలబెట్టింది.
వీజీ సిద్దార్థ భార్య మాళవిక హెగ్డే విజయగాథ..
అది 2019 సంవత్సరం.. భారతదేశంలోని 23 ఏళ్ల చరిత్ర కలిగిన కాఫీ చైన్, కేఫ్ కాఫీ డే (CCD) చాలా కష్టాల్లో ఉంది. వ్యాపారం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాలు తీర్చలేక దాని వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ గందరగోళం మధ్య, ఆయన భార్య మాళవిక హెగ్డే (Malavika Hegde) సంస్థను రక్షించడానికి ముందుకొచ్చింది. కాఫీ పరిశ్రమలో ఎటువంటి వృత్తిపరమైన అనుభవం లేదు. కానీ Cafe Coffee Day కి పూర్వ వైభవం తీసుకురావాలని నిశ్చయించుకుంది.
ఎ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ ప్రముఖ భారతీయ కాఫీ చైన్ అయిన కేఫ్ కాఫీ డే (CCD), దాని యజమాని VG సిద్ధార్థ 2019లో ఆత్మహత్యతో మరణించడంతో పతనం అంచున ఉంది.
సిద్ధార్థ CCDని జాతీయ సంస్థగా అత్యున్నత స్థితికి తీసుకొచ్చారు.. CCD కేవలం కాఫీ షాప్ కంటే ఎక్కువ.. ఇది ప్రజలు కలుసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యే ప్రదేశం. చిట్ చాట్ లు, బిజినెస్ మీటింగ్స్ కి , అన్ని వర్గాల ప్రజల కోసం CCD సింగల్ -స్టాప్ గమ్యస్థానంగా ఉంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి SM కృష్ణ కుమార్తె అయిన మాళవిక హెగ్డే, 1991లో సిద్దార్థను వివాహం చేసుకున్నారు. తన భర్త VG సిద్ధార్థ కెరీర్ మార్గాన్ని అనుసరించింది. ఆమె తన భర్త అకాల మరణం తట్టుకోలేక పోయింది., అయితే ఆమె అతని వారసత్వాన్ని కొనసాగించాలని అతని కలను నెరవేర్చాలని నిశ్చయించుకుంది.
ఆమె భర్త మరణించిన కొన్ని నెలల తర్వాత 2020లో CCD CEO పాత్రలోకి అడుగుపెట్టింది. మాళవిక హెగ్డే CCDని క్రమక్రమంగా పునరుద్ధరించారు హెగ్డే CCD కొత్త CEO అయిన వెంటనే, ఆమె మార్పులను అమలు చేయడం ప్రారంభించారు. ఆమె అనవసరమైన ఆస్తులను తీసేశారు., రుణాన్ని తిరిగి రెన్యూవల్ చేశారు. విఫలమైన వ్యాపారాలను మూసివేశారు.. ఆమె కాఫీ డే ఖాతాదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కూడా దృష్టి సారించారు. హెగ్డే ప్రయత్నాలు ఫలించాయి. ఆమె కొన్ని సంవత్సరాలలోనే CCDని పునరుద్ధరించగలిగారు.. వ్యాపారంలో ఆదాయాలు పెరిగాయి, పర్వతంలా పెరిగిపోయిన రూ. 7,000 కోట్ల రుణం తరిగిపోయింది. కొన్ని సంవత్సరాలలో కంపెనీ పురోగమించింది. సిద్ధార్థ మరణం తర్వాత, CCD ని పూర్తిగా మూసివేస్తారని చాలా మంది భయపడ్డారు. అయితే, కంపెనీ మళ్ళీ నిలబడింది.. CCD పునర్నిర్మాణం కేవలం మాళవిక హెగ్డే మొక్కవోని దీక్ష, కఠోర శ్రమతోనే సాధ్యమైంది. ఆమె విజయం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.
One thought on “ఒంటరి పోరాటంతో 7వేల కోట్ల రుణాలు తీర్చేసింది..”