Monday, October 14Latest Telugu News
Shadow

పర్యాటకులను ఆకర్షిస్తున్న కుంటాల జలపాతం

ఆదిలాబాద్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కుంటాల జలపాతం (Kuntala waterfall) కొత్త అందాలతో పర్యాటలకులను కట్టిపడేస్తోంది. దీనిని చూడాడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తున్నారు.
ఆదిలాబాద్‌ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌తో పాటు సరిహద్దుల్లో ఉన్న కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు.

కుప్టి వాగు ఎగువ బోత్‌లో కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దీంతో కుంటలకు వాగు నీరు చేరి పారుతున్నాయి. పొచ్చెర జలపాతానికి కూడా వర్షపు నీరు రావడం ప్రారంభమైంది. కుప్టి గ్రామానికి చెందిన ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ కుంటాల జలపాతం తోపాటు పొచ్చెర జలపాతాలు, సందర్శకులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు.
ఈ రెండు జలపాతాల నిర్వహణను అటవీ శాఖ చూస్తోంది. ఇది అన్ని భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది.

READ MORE  అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ

జలపాతాల వద్ద నియమించబడిన సెక్యూరిటీ గార్డులు ప్రజలను జలపాతాల దగ్గరికి, ముఖ్యంగా కుంటాల, ఎగువన లేదా దిగువ వైపునకు వెళ్లడానికి అనుమతించడం లేదు. ముఖ్యంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రమాదాలను నివారించడానికి పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నారు.

కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా అనేక ఇతర జలపాతాలు ఉన్నాయి. అయితే ఇవి కుంటాల, పోచెర మాదిరిగా ప్రాచుర్యం పొందలేదు. గుండాల, చింతలమాదర జలపాతాలు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో ఉండగా, సప్తగుండల జలపాతం లింగాపూర్ మండలంలో ఉంది.
మరో వైపు కడెం నీటిపారుదల ప్రాజెక్టుకు పర్యాటకులు. సందర్శకులు కూడా పడవ ప్రయాణాలను ఆస్వాదించడానికి తరలివస్తున్నారు.

READ MORE  Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్