
Telangana Cabinet Meeting | తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో హైడ్రా (Hydra) మరింత పవర్ ఫుల్ గా మారింది. హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అప్పగించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేఖరులకు వెల్లడించారు.చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రా (Hydra)కు విస్త్రత అధికారాలు ఇచ్చారు.
రైతులకు గుడ్ న్యూస్..
మరోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న వడ్లపై రూ.500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచే సన్న వడ్లపై బోనస్ ఇవ్వనున్నారు. అలాగే మూడు విశ్వవిద్యాలయాల పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ కోఠీ మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంగా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంగా టెక్స్‌టైల్స్ అండ్ హ్యాండ్‌లూమ్స్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయంగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్ ఖరారుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తించనుంది. మనోహరా బాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం ఇచ్చారు. 8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించనున్నారు. రూ.3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..