BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ లతో మీ నెలవారీ ఖర్చులను తగ్గించుకోండి..
BSNL Recharge Plans | జియో, ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవలి టారిఫ్ పెంపు తర్వాత దేశవ్యాప్తంగా BSNL ప్రజాదరణ పొందుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ప్రొవైడర్ దేశంలోనే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే ఇప్పుడు చాలా మంది సబ్ స్క్రైబర్లను ఆకర్షిస్తున్నది.. అంతేకాకుండా BSNL తన 4G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. మీరు BSNLని ఉపయోగిస్తుంటే లేదా బిఎస్ ఎన్ ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఏది తక్కువ ఖర్చుతో నెలవారీ రీచార్జ్ ప్లాన్‌లను ఇక్కడ తెలుసుకోండి.
BSNL రూ. 107 మరియు రూ. 153 ధరలతో రెండు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రెండింటి మధ్య కేవలం రూ. 46 ధర వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ, అవి వాటి ప్రయోజనాలలో చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించిన వివరాలు ఇవీ..
BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్
BSNL రూ. 107 ప్లాన్.. ప్రత్యేకించి తక్కువ డేటా వినియోగించేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మిగతా టెలికాం ప్రొవైడర్లు ఇదే ధరలో సాధారణ వ్యాలిడిటీ కేవలం 20-28 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే అపరిమిత కాల్‌లకు బదులుగా, వినియోగదారులు నెలకు 200 కాలింగ్ నిమిషాలను అందుకుంటారు. ఈ కాల్స్ ను అన్ని నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు, ఈ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు 3GB వరకు 4G డేటాను పొందుతారు.
BSNL రూ. 153 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ ధర రూ. 153, ఎక్కువ డేటా వినియోగించుకునే వారికి ఈ రీచార్జ్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. వినియోగదారులు 26GB వరకు 4G డేటాను వినియోగించుకోవచ్చు. 26GB డేటా పూర్తయిన తర్వాత నెట్ స్పీడ్ 40 kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 26 రోజులు. దీనికి అదనంగా, వినియోగదారులు కాంప్లిమెంటరీ హార్డీ గేమ్‌లు, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్, ఆస్ట్రోటెల్, గేమియం, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, BSNL ట్యూన్స్, లిస్ట్న్ పోడోకాస్ట్ కూడా పొందుతారు.
BSNL రూ. 107 vs రూ. 153 రీఛార్జ్ ప్లాన్:
BSNL Recharge Plans మీకు అతితక్కువ డేటాతో పాటు ఎక్స్ టెండెడ్ వాలిడిటీ కావాలనుకుంటే రూ. 107 రీఛార్జ్ ప్లాన్ మీకు ఉత్తమం. దీనికి విరుద్ధంగా మీకు కొన్ని OTT ప్రయోజనాలతో పాటు మరింత డేటా అవసరమైతే, రూ. 153 రీఛార్జ్ ప్లాన్ మీకు బాగా సరిపోతుంది.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.