పాకిస్థాన్‌ను గౌరవించండి.. వారి వద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ను గౌరవించాలని, ఆ దేశంతో చర్చలు జరపాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ కురువృద్ధుడు మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఒకవేళ మన ప్రభుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మనపై బాంబులు వేసే ప్రమాదముందని ఆయన చెప్పారు. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిశంకర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యింది. మనం పాకిస్థాన్‌ను గౌరవించాలని, ఎందుకంటే ఆ దేశం వద్ద అణు బాంబు ఉందని, వాళ్లను మనం గౌరవించకుంటే వాళ్లు మనపై బాంబులను వాడే ప్రమాదం ఉన్నట్లు అయ్యర్ వెల్లడించారు.
పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపాలని, కానీ దానికి బదులుగా మనవాళ్లు మిలిటరీని వాడుతున్నారని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, వారి వద్ద బాంబులు ఉన్నాయని, ఒక పిచ్చోడు బాంబులు వేయాలనుకుంటే ఏమవుతుందో తెలుసా అని ఆయన వ్యాఖ్యానించారు. మన వద్ద కూడా బాంబులు ఉన్నాయని, ఒకవేళ లాహోర్‌పై బాంబు వేస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ 8 సెకన్లలో అమృత్‌సర్ ను తాకుతుందని చెప్పారు.
Rahuls Cong “idealogy” is fully visible in these elections
➡️Support to and from Pakistan incldg offrng to give up Siachen
➡️ Support to and from domestic terror-linked organizations and people like SDPI, Yasin Malik
➡️ Rampant Corruption and loot of money meant for poor… pic.twitter.com/UABONLzNFN— Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam) (@Rajeev_GoI) May 10, 2024
మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుందని బీజేపీ విమర్శించింది. అయ్యర్ మాట్లాడిన వీడియోను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కాంగ్రెస్ నుంచి పాకిస్థాన్‌కు సపోర్టు పెరుగుతోందని, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఐడియాలజీ అని చంద్రశేఖర్ విమర్శించారు. సియాచిన్‌ను వదిలేసుకునేందుకు ఆ పార్టీ సిద్దం అయిదని ఆరోపించారు. ప్రజల్ని విభజించి, అబద్దాలు చెప్పి పేదలను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కాగా పాకిస్థాన్ ఉగ్రవాదుల్ని తరిమికొడుతామని ఇటీవల ప్రధాని మోదీతో పాటు ఇతర నేతలు అనడంతో మణిశంకర్ అయ్యర్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..