పాకిస్థాన్‌ను గౌరవించండి.. వారి వద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
Mani Shankar Aiyar | కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యల వివాదం మర్చిపోకముందే అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సైతం వివాద్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ను గౌరవించాలని, ఆ దేశంతో చర్చలు జరపాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ కురువృద్ధుడు మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar ) చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఒకవేళ మన ప్రభుత్వాలు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తే అప్పుడు పాక్ మనపై బాంబులు వేసే ప్రమాదముందని ఆయన చెప్పారు. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిశంకర్ వ్యాఖ్యలు వైరల్ అయ్యింది. మనం పాకిస్థాన్‌ను గౌరవించాలని, ఎందుకంటే ఆ దేశం వద్ద అణు బాంబు ఉందని, వాళ్లను మనం గౌరవించకుంటే వాళ్లు మనపై బాంబులను వాడే ప్రమాదం ఉన్నట్లు అయ్యర్ వెల్లడిం...