Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

Bharat Rice | పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారత్‌ రైస్ (Bharat Rice) మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది.కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, వ్యాపారుల ద్వారా అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (నాఫెడ్‌) (NAFED), నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్స్యూమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCCCF ), కేంద్రీయ భండార్‌ వంటి సంస్థలు ఈ భార‌త్ రైస్ ను విక్ర‌యించాల‌న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం నాఫెడ్‌ ద్వా రా గ్రేటర్ హైద‌రాబాద్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్‌ రైస్ అమ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి. గ‌త‌ 15 రోజులుగా విక్ర‌యాలు కొన‌సాగుతున్నాయ‌ని నాఫెడ్‌ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వేల క్వింటాళ్ల వరకు అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా భార‌త్ రైస్ పై త‌గినంత ప్రచారం లేకపోవడంతో 15రోజులుగా అమ్మ‌కాలు మొద‌లైనా జోరందుకోలేదు. ఈ రైస్ క్వాలిటీ అంత‌గా బాగుండ‌ద‌నే అనుమానంతో చాలా మంది ముందుకురావ‌డం లేద‌ని అన్నం వండిన తర్వాత దొడ్డుగా ఉంటోందని కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. రుచిగా ఉంటున్నప్పటికీ సన్నగా ఉండకపోవడంతో ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నారు. .

READ MORE  Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు

Bharat Rice పంపిణీ కేంద్రాలు ..

  • ఏపీ రైస్‌ స్టోర్స్‌, మెట్టుగూడ
  • చంద్రమౌళి ట్రేడర్స్‌, కార్వాన్‌
  • ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్‌ఆర్‌నగర్‌
  • డింగ్‌డాంగ్‌ సూపర్‌ మార్కెట్‌
  • గౌతమ్‌రైస్‌ డిపో, కాప్రా
  • జై తుల్జాభవానీ ఏజెన్సీ, లంగర్‌హౌజ్‌
  • మాణిక్య ట్రేడర్స్‌, ఆర్‌కే పురం
  • మురళీ కిరణ్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, పటాన్‌చెరువు
  • ముత్తయ్య గ్రాండ్‌ బజార్‌, శేరిలింగంపల్లి
  • ఖైసర్‌ కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్‌, హైదరాబాద్‌
  • సాయిదీప్‌ సూపర్‌ స్టోర్స్‌, మెదక్‌
  • సిర్వి ట్రేడర్స్‌, బోడుప్పల్‌
  • శంకర్‌ ట్రేడింగ్‌ కంపెనీ, సికింద్రాబాద్‌
  • శ్రీ గోవిందా ట్రేడర్స్‌, కాచిగూడ
  • శ్రీ వీరభద్ర ట్రేడర్స్‌, కవాడిగూడ
  • శ్రీ అంబ ట్రేడర్స్‌, హైదరాబాద్‌
  • శ్రీ బాలాజీ రైస్‌ డిపో, రాంనగర్‌
  • శ్రీ సాయిబాబా రైస్‌ డిపో, కార్వాన్‌
  • సాయిశివ రైస్‌ ట్రేడర్స్‌, కర్మన్‌ఘాట్‌
  • శ్రీ సాయి ట్రేడర్స్‌, కొత్తపేట
  • శ్రీ ట్రేడర్స్‌, చందానగర్‌
  • ఉజ్వల్‌ ట్రేడర్స్‌, మల్లేపల్లి
  • ఉప్పు రాజయ్య ట్రేడర్స్‌, షాపూర్‌నగర్‌
  • రిలయన్స్‌, దేవరయంజాల్‌
READ MORE  EPF Rules 2024 | ఏళ్ల తరబడి పీఫ్ క్లెయిమ్ కోసం తిరిగాడు.. చివరకు అతడు చనిపోయాకే స్పందించిన అధికారులు

Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “Bharat Rice |భార‌త్ రైస్ కోసం ఎదురుచూస్తున్నారా? .. గ్రేట‌ర్ ప‌రిధిలోని 24 ప్రాంతాల్లో విక్ర‌యాలు..

  1. Bharsth Atta vana are seen selling Atta but not Bharath rice . Why ?? The same vans can be used for selling Bharath rice .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *