Posted in

Bharat NCAP : ఇండియాలో మొదటి క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభమైంది.. భారత్​ ఎన్​సీఏపీ అంటే ఏమిటీ? పూర్తి వివరాలు ఇవీ..

bharat ncap rating telugu
bharat ncap
Spread the love

Bharat NCAP launched : భారతదేశంలో రోడ్డు భద్రత, వాహనాల నాణ్యత ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. భారత్​ ఎన్​సీఏపీ (భారత్​ న్యూ కార్​ అసెస్​మెంట్​ ప్రోగ్రామ్​) ను కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ఆగస్టు 22న మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​.. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా.. దేశీయంగా కార్​ క్రాష్​ టెస్ట్​ ప్రోగ్రామ్​ కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్​, దక్షిణ కొరియాలో ఈ పరీక్షలు చేస్తున్నారు.

వాహన వినియోగదారుల భద్రతే లక్ష్యం

దేశీయ ఆటోమొబైల్​ మార్కెట్​ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే చాలా మోడళ్ల కార్లు​ రోడ్డుపై తిరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అడుగుపెడతాయి. అయితే.. భద్రతా పరంగా ఏ వాహనాన్ని ఎంచుకోవాలనే దానిపై సందేహిస్తున్న కస్టమర్లకు.. ఈ భారత్​ ఎన్​సీఏపీ సరిగ్గా ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
ఈ ప్రోగ్రామ్​.. వాహన భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు ఆటోమొబైల్​ రంగ సంస్థలకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది. ఎన్​సీఏపీ లో భాగంగా 3,500 కేజీల కన్నా ఎక్కువ బరువున్న వాహనాలను పరీక్ష చేశారు. ఇందులో మంచి స్కోర్​ సాధిస్తే, అంతర్జాతీయ మా ర్కెట్ లోనూ మన వాహనాలకు డిమాండ్​ పెరుగుతుంది. తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయి. ఈ ప్రోగ్రామ్​ను మహీంద్రా అండ్​ మహీంద్రా, టయోటా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్​ వంటి దేశీయ సంస్థలు ఇప్పటికే స్వాగతించి ప్రశంసించాయి.

Bharat NCAP rating : భారత్​ ఎన్​సీఏపీ లో భాగంగా.. వాహనాల తయారీ సంస్థలు, తమ మోడళ్ల​ను ఏఐఎస్​ 197 (ఆటోమోటివ్​ ఇండస్ట్రీ స్టాండర్డ్​) కింద స్వచ్ఛందంగా పరీక్ష కోసం ఇవ్వొచ్చు. ఇది స్వచ్ఛందమే అయినా, సంస్థలన్నీ ఇందులో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తామని కేంద్రం చెబుతున్నది. అంతేకాకుండా.. ఈ ప్రోగ్రామ్​ కింద అధికారులకు.. ఏ షోరూమ్​ నుంచైనా, ఏ వాహనాన్నైనా పిక్​ చేసి పరీక్షించే అధికారం కూడా వస్తుంది.

గ్లోబల్​ ఎన్​సీఏపీ, యూరో ఎన్​సీఏపీ వంటి ప్రాచుర్యం పొందిన టెస్టింగ్​ ప్రోగ్రామ్స్​న లో నిబంధనలను అనుసరించి ఈ భారత్​ ఎన్​సీఏపీని రూపొందించారు. ఏఓపీ (అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​), సీఓపీ ( చైల్డ్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​ ) తో పాటు పలు టెస్ట్​లు నిర్వహించి స్టార్​ రేటింగ్స్​ ఇస్తారు. ఈ టెస్ట్​లో 3, అంతకన్నా ఎక్కువ రేటింగ్​ పొందాలంటే, వాహనాల్లో ఖచ్చితంగా ఈఎస్​సీ (ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​) ఉండాల్సిందే..

భారత్ NCAP లక్షణాలు

1) భారత్ NCAP అక్టోబర్ 1, 2023 నుండి వర్తిస్తుంది
2) ఇది స్వచ్ఛంద పరీక్ష.. అందువల్ల ఏ వాహన తయారీదారు అయినా తమ వాహనాలను పరీక్ష కోసం పంపడం తప్పనిసరి కాదు
3) ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 ప్రకారం కార్లు పరీక్షించబడతాయి
4) పరీక్ష M1 తరగతి వాహనాలకు పరిమితం చేయబడింది.అంటే 8 మంది ప్రయాణికులు + 1 డ్రైవర్ ఉన్న వాహనాలు, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న కార్లు మాత్రమే ఈ పరీక్ష చేయనున్నారు.

భారత్ NCAP: రేటింగ్‌లు వివరాలు

భారత్ NCAP అనేది వాలంటరీ క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్, దీనిలో కార్లు అడల్ట్ ఓక్యుపెంట్స్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ (COP) తోపాటు ఫిట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీస్ ఆధారంగా రేటింగ్ ఇస్తారు. కస్టమర్‌లు వివిధ వాహనాల భద్రతా ప్రమాణాలను తెలుసుకోవడానికి ఈ స్టార్ రేటింగ్‌లు ఉపయోగపడతాయి. ఈ స్టార్ రేటింగ్ ఆధారంగా వారు తమ వాహనాలను కొనుగోలు చేయవచ్చు.
భారత్ NCAP స్టార్ రేటింగ్ అనేది.. ఫ్రంటల్, సైడ్, పోల్-సైడ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్‌లతో సహా కఠినమైన క్రాష్ టెస్టుల ద్వారా నిర్ణయిస్తారు.

ఉదాహరణకి, ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో కారు 64 కి.మీ వేగంతో క్రాష్ చేయబడింది. అలాగే సైడ్ క్రాష్ 50 కి.మీ, పోల్-సైడ్ టెస్ట్‌లు 29 కి.మీ వేగంతో క్రాష్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షల సమయంలో వాహనం లోపల సెన్సార్-ఆధారిత డమ్మీ మానవుల బొమ్మలు ఉంటాయి. వాహనం ముందు సీట్లలో పెద్దల భద్రత, వెనుక సీట్లలో పిల్లల భద్రతపై పరీక్షించి రేటింగ్‌లు ఇస్తారు. 5-స్టార్ రేటింగ్ ఇందులో టాప్ గా పరిగణిస్సారు.

గ్లోబల్ NCAP vs భారత్ NCAP

ఇప్పటి వరకు, భారతదేశంలో విక్రయించిన కార్లను గ్లోబల్ NCAP, దక్షిణాఫ్రికాలోని SaferCarsForIndia వంటి ప్రోగ్రామ్ లలో పరీక్షించారు. 2014లో ప్రారంభించబడిన ఈ ప్రోగ్రామ్ 50కి పైగా కార్లను పరీక్షించింది. మనదేశంలోని టాటా మోటార్స్., మహీంద్రా వంటి భారతీయ బ్రాండ్‌లు క్రాష్ టెస్ట్ రేటింగ్‌లలో ఉత్తమంగా రాణించాయి. వారి కార్లు 4, 5-స్టార్ రేటింగ్‌లను సాధించి అమ్మకాల పెరుగుదలతో సహాయపడింది. అయితే కొత్తగా భారత్ NCAP ప్రారంభమైతే భారతదేశంలో రహదారి భద్రతా ప్రమాణాలు మారుతాయని భావిస్తున్నారు. గ్లోబల్ NCAP అనుభవం ఆధారంగా కేంద్రం ఈ భారత్ NCAPని రూపొందించింది.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *