Saturday, April 19Welcome to Vandebhaarath

Bengaluru-Ernakulam | జూలై 31 నుంచి బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ప్రారంభం.. ఈ స్టేషన్లలో హాల్టింగ్

Spread the love

Bengaluru | ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బెంగుళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Bengaluru-Ernakulam Vande Bharat) ఎట్టకేలకు జూలై 31న ప్రారంభం కానుంది. ప‌లు నివేదికల ప్రకారం, ఈ కొత్త రైలు వారానికి మూడు సార్లు నడుస్తుంది. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని చాలా వ‌ర‌కు తగ్గిస్తుంది. కేరళలో ఇది మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.

టైమింగ్స్ ఇవీ..

ఎనిమిది కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది, ఎర్నాకులం నుంచి – బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు వారాల్లో సేవ‌లు అందజేస్తుంది.

READ MORE  Kumbh Mela 2025 : మహా కుంభమేళా గురించి మీరు తెలుసుకోవలసిన 10 ముఖ్యమైన విషయాలు

మరోవైపు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది, గురు, శని, సోమవారాల్లో నడుస్తుంది. రైలు మార్గంలో త్రిస్సూర్, పాలక్కాడ్, పోడన్నూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం అనే ఆరు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంటుంది.

Bengaluru-Ernakulam Vande Bharat ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వ‌స్తే.. త్రిస్సూర్, ఎర్నాకులం నుంచి బెంగుళూరుకు దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇందులో విద్యార్థులు, వ్యాపారులు, రాజధాని నగరానికి క్రమం తప్పకుండా ప్రయాణించే ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఈ కొత్త రైలుతో బెంగుళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను విస్తరించిన‌ట్లయింది. ఇప్పటికే మైసూరు, చెన్నై, హైదరాబాద్, ధార్వాడ్, కోయంబత్తూరుకు కలుపుతుంది.

READ MORE  Haryana Municipal Election : రాష్ట్రంలో బిజెపి ఘన విజయం.. 10 కార్పొరేషన్లలో 9 కార్పొరేషన్ల కైవసం | పూర్తి విజేతల జాబితా

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *