Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

Zodiac Sign | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 31 ఆదివారం నుంచి ఏప్రిల్ 6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు

మేష రాశి

( 31’st mar – 6’th Apr ) మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు civil repairs చేసే అవకాశాలు కలవు. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బంగారము వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరమైన పురోగతి ఉంటుంది. దైవ చింతనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ధనపరమైన చికాకులు ఉండును. Paper industry వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. భవిష్యత్తుకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శరీరం నందు బెనకడం మరియు Urinary Tract Infections ఒక సమస్యగా మారే అవకాశాలు కలవు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారంలో నూతన వ్యాపార ప్రారంభ నిమిత్తం ధన వ్యయం చేయవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలకు ఔషధ సేవ చేయవలసి వస్తుంది. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కొంత తగ్గుముఖం పడతాయి. Pharmacy వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. Software ఉద్యోగస్తులకు కంపెనీ యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. గవర్నమెంట్ పర్మిషన్స్ మంజూరు అవుతాయి. మానసిక ఉల్లాసంతో కాలాన్ని కలుపుతారు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు ఉండును. కోర్టు కేసుల యందు విజయాలు సాధిస్తారు. కొంతమేరకు అప్పుని తీర్చగలుగుతారు. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. స్థూల కాయంతో ఇబ్బంది పడేవారు ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు శుభవార్త వింటారు. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. పొత్తికడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. అసంతృప్తి భోజనము ఉంటుంది. Plastic మరియు Rubber వ్యాపారస్తులకు నష్టములు ఉండును. కుటుంబ పరమైన సమస్యలు ఉండును. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. Administration ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. గతంలో చేసిన పొరపాట్లకు తగిన మూల్యము అనుభవించవలసి వస్తుంది. Real Estate వ్యాపారస్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. మీ బలహీనతల వలన మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడే అవకాశాలు కలవు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. గణపతి స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. kangan hall వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. మీ బలహీనతలను మీ శత్రువులకు తెలియకుండా జాగ్రత్త పడండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు కారణం గౌరవం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అకారణ వైరంకు దూరంగా ఉండాలి. పోలీసు శాఖ వారికి అధికారుల నుంచి సమస్యలు ఉండను. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సత్ఫలితాలు ఉండును. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలము. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు. Joint మరియు Muscle Pains ఒక సమస్యగా మారుతుంది. ధనపరమైన ఇబ్బందులు కొంత మేరకు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల వారి సలహా పాటించండి. స్త్రీలతో కలహం అంత మంచిది కాదు. ముఖ్యమైన పనుల యందు తల్లి సహకారం లభిస్తుంది. పాల వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. సంతాన ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ ఎదుగుదలను చూసి తల్లితండ్రుల ఆనందిస్తారు. దూరప్రాత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన కారణము శరీరానికి గాయాలయ్య అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. వృత్తిరీత్యా పనులు ఆలస్యం అవుతాయి. అప్పుల బాధ అధికమవుతుంది. వైద్య వృత్తిలో ఉన్నవారు ఆకస్మిక విదేశీ పర్యటన చేసే అవకాశాలు కలవు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన.

కన్యా రాశి

కన్య రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. మీ మాట చెల్లుబాటు అవుతుంది. Chit fund వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ప్రయాణాల వల్ల నష్టం చేకూరుతుంది. కుటుంబ కలతలు ఉండును. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు బయట పడే అవకాశాలు కలవు. తండ్రికి ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. Banking Sector ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోని అడుగులు ముందుకు వేస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..

తులా రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మంచి మనసుతో ఇతరులకు ధన సహాయం చేస్తారు. విద్యార్థులకు యోగ కాలము. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. Food Business వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సంతాన భవిష్యత్తుపై కృషి చేస్తారు. మీ సంతానానికి శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు. మీ జీవిత భాగస్వామితో చర్చలు నిర్వహిస్తారు. ఏ నిర్ణయం అయినా మొండితనంతో తీసుకుంటారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. నూతన ఆదాయం మార్గాలను అన్వేషించాలి. నూతన వ్యాపారానికి అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. సోదరీ సోదరుల మధ్య చర్చలు కొలిక్కి వస్తాయి. Oil & Paints వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. పైత్య సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉండదు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన దంపతులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఇబ్బందులు ఉండను. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. వేడి ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. బంధువులతో వైరం అంత మంచిది కాదు. సోదరితో సరదాగా కాలాన్ని గడుపుతారు. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. విద్యార్థులకు శ్రమ చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. శారీరక శ్రమ గోచరిస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. పోలీస్ శాఖ వారు Corruption కి దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అడుగులు పడతాయి. పోలీసు శాఖ వారికి సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. అసత్యం ఆడడం వల్ల ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. సోదరీ సోదరులతో ఆస్తి రీత్యా చర్చలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పర్మిషన్స్ మంజూరు అవుతాయి. తల్లి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారంలో ఆర్థికపరమైన ఇబ్బందులకు పరిష్కారాన్ని ఆలోచించాలి. Sugar వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. Food items వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు బయట పడతాయి. అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా కాలాన్ని గడుపుతారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టాలి. కుటుంబ కలతలకు దూరంగా ఉండాలి. దీఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారంలో దైవానుగ్రహం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉండును. జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. Textile వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. Revenue Department ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఇతరుల విషయాలలో తలదూర్చకూడదు. గొడవల జోలికి పోవడం వలన నష్టపోయే అవకాశం కలదు. వేళ తప్పిన భోజనం ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనపరమైన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. ఆంజనేయ స్వామికి చందనం పూజ జరిపించడం చెప్పదగిన సూచన.

Weekly Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *