Tuesday, April 8Welcome to Vandebhaarath

Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Spread the love

iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై  భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది.

READ MORE  Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన

Apple slashes iPhone prices : కాగా ఆపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలను ఇప్పటివరకు తగ్గించలేదు.  2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 15 శాతానికి తగ్గించడంతో స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు పొందే అవకాశం దక్కింది. సాధారణంగా  కొత్త ఐఫోన్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నప్పుడు పాత మోడల్ ఫోన్ల ధరలు తగ్గిస్తోంది. ఒక్కోసారి  ఆపిల్ ధర డిస్కౌంట్ తోపాటు డీలర్లు, రీసెల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల సేల్స్ క్లియర్ చేసుకోవడానికి తరచూ అదనపు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు.

READ MORE  Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ‌.. కారణం ఎందుకో తెలుసా..

[table id=26 /]
అయితే, ఇ-కామర్స్ రిటైలర్లు ఈ మోడళ్లను మరింత తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు, iPhone 14 (128GB) ఫ్లిప్‌కార్ట్‌లో ₹59,999కి,  iPhone 15 (128GB) ₹71,999కి అందుబాటులో ఉంది. iPhone 15 Pro (128GB),  iPhone 15 Pro Max (256GB) కూడా వరుసగా ₹1,24,990,  రూ.1,39,990 వద్ద  అందుబాటులో ఉన్నాయి.

ఈ ధర తగ్గింపు చైనాలో ఐఫోన్ డిమాండ్ తగ్గుదలతో సమానంగా ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనాలో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 6.7% తగ్గాయి.

READ MORE  BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *