Thursday, November 14Latest Telugu News
Shadow

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

READ MORE  Rajnath Singh | పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమైందని తెలిపారు.. నేడు బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, సత్యసాయి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని అక్కడక్కడ   తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

READ MORE  Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *