Monday, May 19Welcome to Vandebhaarath

Andhrapradesh

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision
Andhrapradesh

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.Cabinet Decision :17 భారీ వంతెనలుఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్...
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..
Andhrapradesh

TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..

TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు.TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగులు గ్రహించాలని ఆయన కోరారు. "క్రైస్తవులు కానివారు లేదా ముస్లిమేతరులు వారి వారి ప్రార్థనా స్థలాలలో లేనట్లే, తిరుమలలో కూడా హిందూయేతర ఉద్యోగులు ఉండకూడదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆస...
Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..
Andhrapradesh, Special Stories

Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని '100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్' సాధించిన రికార్డు నమోదు చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ తొలిసార...
Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..
Andhrapradesh, Telangana

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి.ఈ స్టేష‌న్ల‌లో హాల్టింగ్ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్ర‌త్యేక రైళ్ల‌కు హాల్టింగ్ సౌక‌ర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జ...
TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..
Andhrapradesh

TTD | టీటీడీలో అన్యమత ఉద్యోగులకు షాక్..

TTD Employees Transferred : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అన్యమత ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీలో హిందూవేతర ఉద్యోగులపై పాలక మండలి బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా 18 మంది ఉద్యోగులను అధికారులు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా టీటీడీలో మొత్తం 300 మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది .కాగా బదిలీ అయిన వారి (TTD Employees Transferred ) లో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, వివిధ విద్య సంస్థల్లోని లెక్చరర్లు, హాస్ట‌ల్ వార్డెన్, తదితరులు ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది అన్యమత ఉద్యోగులను కూడా ట్రాన్స్ ఫ‌ర్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు డైరెక్ట్ క్యూలైన్‌లో వెళ్తున్నారు. స్వామ...
Sankranti Festival : సంక్రాంతి ప్ర‌యాణికుల‌తో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల దోపిడీ
Andhrapradesh

Sankranti Festival : సంక్రాంతి ప్ర‌యాణికుల‌తో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిట‌కిట.. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల దోపిడీ

Hyderabad : సంక్రాంతి వేడుక‌లు (Sankranti Festival) స‌మీపిస్తుండ‌డంతో పండుగ‌ల వేడుక‌లు ఉత్సాహంగా జ‌రుపునేందుకు హైద‌రాబాద్ జ‌న‌మంతా త‌మ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప‌య‌న‌మ‌వుతున్నారు. విద్యాల‌యాల‌కు సెలవులు ప్ర‌క‌టించ‌డంతో పిల్ల‌ల‌తో క‌లిసి కుటుంబ‌స‌మేతంగా హైద‌రాబాద్‌, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో త‌ర‌లివ‌స్తున్నారు. దీంతో అన్ని బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, సాధార‌ణ ప్ర‌జ‌లు ప్లాట్‌ఫారమ్‌లపై బ‌స్సులు, రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. కాగా జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి ప్ర‌యాణికుల‌ రద్దీకి అనుగుణంగా 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వారి లగేజీతో పాటు సికింద్రాబాద్ స్టేషన్‌న...
Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
Andhrapradesh, Telangana

Holidays :సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు

AP TG Sankranti Holidays 2025 : హైదరాబాద్: సంక్రాంతి ప‌ర్వ‌దినానికి సంబంధించి తెలంగాణ ఇంటర్‌ బోర్డు సెలవులను ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ మంగ‌ళ‌వారం ఒక‌ ప్రకటన విడుదల చేసింది. కళాశాలలు తిరిగి 17న ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించొద్ద‌ని ఆదేశించింది. నిబంధ‌న‌లు అతిక్ర‌మించి క్లాసులు నిర్వ‌హిస్తే చర్యలు తీసుకుంటామని ఇంట‌ర్‌ బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు వ‌చ్చాయి.కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై స్ప‌ష్ట‌త ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో ఈనెల 13న భోగి, 14న సంక్రాంతికి సెల‌వులు ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. భోగికి ముందు రో...
రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. పట్టాలెక్కనున్న రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులు..
Andhrapradesh

రేపు ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో మోదీ ప‌ర్య‌ట‌న‌.. పట్టాలెక్కనున్న రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్రాజెక్టులు..

PM Modi AP Tour | ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయ‌న‌ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులు సుస్థిర అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల పెంపుదల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రధాన కృషిలో ఒక భాగమని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే గురువారం భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును కూడా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్రారంభించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఇత‌ర ప్రాజెక‌ట్ఉల‌ను ప్రారంభించేందుకు. విశాఖపట్నం ప్రజలను క‌లుసుకునేందుకు తాను ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. NTPC గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన, నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కింద ఇటువంటి హబ్‌గా అ...
Sankranti 2025 | సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
Andhrapradesh

Sankranti 2025 | సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

2025 Sankranti Special Buses | సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే చాలు హైద‌రాబాద్ (Hyderabad)మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది. పండుగ సెలవుల‌ను ఎంజాయ్ చేయ‌డానికి న‌గ‌ర‌వాసులు త‌మ సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌వుతారు. ముఖ్యంగా న‌గ‌రంలో చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు సంక్రాంతి సంద‌ర్భంగా ఆంధ్రాకు పెద్ద ఎత్తున ప్ర‌యాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. ఆర్టీసీ బ‌స్సులు, రైళ్లలో క‌నీసం నిల‌బ‌డేందుకు కూడా స్థ‌లం ఉండ‌దు.. ప్ర‌యాణికుల ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు టిజిఆర్టీసీ (TGSRTC) తీపిక‌బురు చెప్పింది.557 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యంసొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముంద‌స్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ ‌నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌(Andhra Pradesh)కు కూడా ప్రత్యేక బస్సులను నడ‌పాల‌ని నిర్ణ‌...
Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా  తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు
Andhrapradesh, Telangana

Sankranti Festival Special buses | సంక్రాంతి సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాలకు ప్ర‌త్యేక బ‌స్సులు

Sankranti Festival Special buses : సంక్రాంతి పండుగ (Sankranti Festival) సంద‌ర్భంగా తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు టీజిఎస్ఆర్‌టిసి శుభ‌వార్త చెప్పింది. ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాలు ఆంధ్రప్రదేశ్‌కు 300 ప్రత్యేక బస్సులు సహా 6,500 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ (TGSRTC) తెలిపింది.సాధారణ సర్వీసుల కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. జనవరి 7 నుంచి 15 వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కేటగిరీలకు చెందిన ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది, కానీ రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 10న 1,600 బస్సులు, 1900 బస్సులు నడిచే జనవరి 11న భారీ డిమాండ్‌ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రధ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..