ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు

ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో :  ఎఫ్ఐఆర్ నమోదు

Amit Shah Doctored Video | న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన‌ట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఫేక్ వీడియోను స‌ర్క్యులేట్ చేసిన‌వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు చేసింది.
ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ (BJP ) ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు వ్యాఖ్య‌ల‌ను వక్రీకరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మార్చార‌ని బీజేపీ ఆరోపించింది. బీజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. కాంగ్రెస్ X ఖాతాను బ్లాక్ చేసి దర్యాప్తు  ప్రారంభించాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం అధికారిని కోరింది.

READ MORE  Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

తెలంగాణలో ఎన్నికల ర్యాలీలో హోంమంత్రి చేసిన ఒరిజినల్ ప్రసంగాన్ని తారుమారు చేసి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అమిత్ షా మాట్టాడినట్లు వక్రీకరించారని బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంది. “కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఒరిజినల్ ప్రసంగాన్ని తారుమారు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, వారికి తీరని నష్టం కలిగించేలా ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశం అంతటా సర్క్యులేట్ చేశారని అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ల తొలగింపుపై అమిత్ షా మాట్లాడుతున్న వీడియోను లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి.. పూర్తి రిజర్వేషన్ల రద్దు కోసం వాదిస్తున్నారని అర్థం వచ్చేలా తారుమారు చేశారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక హ్యాండిల్స్‌తో సహా వివిధ సోషల్ మీడియా ఖాతాలు, SC/ST రిజర్వేషన్‌లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు పేర్కొంటూ వీడియోను షేర్ చేశాయి. ‘మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చేసిన ఎన్నికల ప్రసంగం వైరల్‌గా మారింది’ అని జార్ఖండ్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

READ MORE  MODI 3.0 | మోదీ క్యాబినెట్‌లో యువ ఎంపీలు చిరాగ్ పాశ్వాన్, అన్నామలై.. !
SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉన్న అధికారిక ఖాతాలతో సహా వివిధ సోషల్ మీడియా హ్యాండిల్‌లు న‌కిలీ వీడియోను షేర్ చేయ‌డంతో ఈ వివాదం తీవ్రమైంది, ఇది “ఎస్‌సి/ఎస్‌టి రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలనేదే బిజెపి ఎజెండా” అని ఈ వీడియోలో ఉంది. దీంతో ఈ వ్య‌వ‌హారంపై బిజెపి నాయకులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన ఫిర్యాదుకు సమగ్ర నివేదికను జత చేసింది, అయితే తాజా ఎఫ్‌ఐఆర్‌తో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) యూనిట్ కల్పిత వీడియోపై దర్యాప్తు ప్రారంభించింది.

 

READ MORE  Raksha Bandhan 2023 : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం, చరిత్ర, ప్రాముఖ్యత

One thought on “ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *