PM Modi attack on Congress : కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అంబేద్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. అమిత్‌షా (Amith Shah) తన ప్రసంగంలో అంబేద్కర్‌ను అవమానించినట్టు కాంగ్రెస్ (Congress) చేసిన ఆరోపణలను ఖండించారు. అమిత్‌షా ప్రసంగంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కంగుతిన్నదని వ్యాఖ్యానించారు. అమిత్‌షా ఆ పార్టీ చీకటి చరిత్రను బయట పట్టిందని పేర్కొన్నారు. ఈ వాస్తవాలను బయట పడటం వల్లే ప్రతిపక్ష పార్టీ నాటకాలకు తెరతీసిందని విమర్శించారు. మోదీ ఎక్స్ పోస్టుల ద్వారా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అంబేద్కర్‌ను తమ ప్రభుత్వం గౌరవిస్తోందని స్పష్టం చేశారు. అంబేద్కర్ పట్ల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేటట్టు తాము వ్యవహరించబోమని పేర్కొన్నారు.
Modi ఇంకా ఏమన్నారంటే..
కాంగ్రెస్ చేసిన తప్పదాలు దాగుతాయని ఆ పార్టీ, దాని మిత్రపక్షం భావిస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అంబేద్కర్‌ను అవమానించేది వారేనని, ఈ దుశ్చర్యలను ప్రజలు అనేకసార్లు చూశారని గుర్తు చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నేతృత్వంలోని పార్టీ అంబేద్కర్ వారసత్వాన్ని చెరిపివేసేందుకు, ఎస్సీ, ఎస్టీ సముదాయాలను అవమానించేందుకు శతాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించేందుకు రెండుసార్లు ప్రయత్నించిందన్నారు.
అగౌరవ పర్చేది వారే..
Ambedkar Row : అంబేద్కర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వకుండా నిరాకరించింది కాంగ్రెస్సే అని మోదీ ఆరోపించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రాన్ని గౌరవ స్థానం కల్పించకుండా నిరోధించింది ఆ పార్టీయేనన్నారు. ఎస్సీ, ఎస్టీ సముదాయాలపై జరిగిన అత్యంత హింసాత్మక సంఘటనలు కాంగ్రెస్ పాలనలలోనే జరిగాయన్నారు. దశాబ్దాలుగా వారు అధికారంలో ఉన్నా ఈ సముదాయాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు దశాబ్దకాలంగా తమ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని మోదీ తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలు నెరవేరస్తున్నాం..
PM Modi attack on Congress Party : తమ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు దశాబ్ద కాలంగా నిరంతరం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. అదే స్ఫూర్తితో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీయడం, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేయడం, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఉజ్జ్వల యోజన వంటి పథకాలను సమర్థంగా అమలు చేసి పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పంచతీర్థాల అభివృద్ధి, చైత్యభూమి సమస్యను పరిష్కరించడం, లండన్‌లోని ఆయన నివాసాన్ని సేకరించడం వంటి చర్యలను తమ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..