AIIMS Rishikesh Viral Video | నిందితుడి కోసం ఆస్ప‌త్రి ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చిన పోలీసు వాహనం..

AIIMS Rishikesh Viral Video | నిందితుడి కోసం ఆస్ప‌త్రి ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చిన పోలీసు వాహనం..
Spread the love

AIIMS Rishikesh Viral Video | ఓ మహిళా డాక్ట‌ర్ పై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అసాధారణమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. నిందితున్ని ప‌ట్టుకునేందుకు పోలీసులు త‌మ వాహనంతో ఏకంగా ఎయిమ్స్ రిషికేశ్‌లోని ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 26-సెకన్ల వీడియో క్లిప్‌లో ఒక యాక్షన్ మూవీని త‌ల‌పిస్తోంది. మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నర్సింగ్‌ అధికారిని అరెస్టు చేయాలని పోలీసులు భావించారు.
ఈ వీడియోలో పోలీసు వాహ‌నం రద్దీగా ఉండే ఎమర్జెన్సీ వార్డు గుండా డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. రెండు వైపులా బెడ్‌లపై రోగులు ఉన్నారు. భద్రతా అధికారుల బృందం SUV కి దారి ఇచ్చేందుకు క్లియర్ చేయడం, దారికి అడ్డంగా ఉన్న స్ట్రెచర్లను ప‌క్క‌కు నెట్టడం కనిపిస్తుంది. చాలా మంది పోలీసు అధికారులతో కారు ముందుకు వస్తున్న‌ట్లు వీడియోలో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రీమియర్ హెల్త్ ఫెసిలిటీలోని ఆపరేషన్ థియేటర్‌లో నర్సింగ్ అధికారి మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో సస్పెండ్ అయిన సతీష్ కుమార్ వైద్యురాలికి అసభ్యకరమైన SMS పంపినట్లు రిషికేశ్ పోలీసు అధికారి శంకర్ సింగ్ బిష్త్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఈ సంఘటన ఆసుపత్రి వైద్యులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. వైద్యులు సమ్మెకు దిగారు. నిందితుడిని విధుల నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తూ డీన్ కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. వైద్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు.

పెద్దసంఖ్యలో నిరసన తెలుపుతున్న వైద్యులను చూసిన పోలీసులు.. సతీష్ కుమార్‌ను అరెస్టు చేసేందుకు ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరో వీడియోలో, నిందితుడిని కారులోకి తీసుకెళ్తున్నప్పుడు నిరసన తెలిపిన వైద్యులు చుట్టుముట్టిన పోలీసు అధికారులను చూడవచ్చు. కాగా సతీష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసినా సరిపోదని, సతీష్‌కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఎయిమ్స్ రిషికేశ్‌లో అత్యవసర సేవలు ఇంకా పనిచేస్తుండగా, మంగళవారం నుంచి వైద్యులు సమ్మె చేస్తున్నారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *