AIIMS Rishikesh Viral Video | నిందితుడి కోసం ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చిన పోలీసు వాహనం..
AIIMS Rishikesh Viral Video | ఓ మహిళా డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అసాధారణమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. నిందితున్ని పట్టుకునేందుకు పోలీసులు తమ వాహనంతో ఏకంగా ఎయిమ్స్ రిషికేశ్‌లోని ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 26-సెకన్ల వీడియో క్లిప్‌లో ఒక యాక్షన్ మూవీని తలపిస్తోంది. మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నర్సింగ్ అధికారిని అరెస్టు చేయాలని పోలీసులు భావించారు.
ఈ వీడియోలో పోలీసు వాహనం రద్దీగా ఉండే ఎమర్జెన్సీ వార్డు గుండా డ్రైవింగ్ చేస్తూ కనిపించింది. రెండు వైపులా బెడ్‌లపై రోగులు ఉన్నారు. భద్రతా అధికారుల బృందం SUV కి దారి ఇచ్చేందుకు క్లియర్ చేయడం, దారికి అడ్డంగా ఉన్న స్ట్రెచర్లను పక్కకు నెట్టడం కనిపిస్తుంది. చాలా మంది పోలీసు అధికారులతో కారు ముందుకు వస్తున్నట్లు వీడియోలో ఉ...