TGSRTC | రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ బస్సులలో ఇకపై సరికొత్త టెక్నాలజీ..!
AI-powered alert ADAS | హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఆధునిక టెక్నాలజీ వైపు ముందుకుసాగుతోంది. ప్రమాదాలను నివారించేందుకు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) డివైజ్‌ను ఇన్ స్టాల్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) ఈ కాన్సెప్ట్‌ను తమ బస్సుల్లో పెద్ద ఎత్తున అమర్చాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 రాష్ట్ర రవాణా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-పవర్డ్ అలర్ట్ సిస్టమ్ గత ఏడాదిలో హైవేలపై ప్రమాదాలను 40 శాతం వరకు తగ్గించడంలో సహాయపడింది.
హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తుగా 2022 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని మూడు జాతీయ రహదారులైన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్‌లో ప్రయాణించే బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 2023, ఏప్రిల్ 2024 మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన హైవే కారిడార్‌లలో రాష్ట్ర రవాణా బస్సుల (TGSRTC )తో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల సంఖ్య ADAS అమర్చని బస్సులతో పోల్చితే ADAS పరికరాలు ఉన్న బస్సులలో 40 శాతం తక్కువగా ఉంది.
INAI నేతృత్వంలో IIIT-హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సంయుక్తంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రహదారి భద్రత, ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణలో సవాళ్లను పరిష్కరించడానికి AIని ఉపయోగిస్తుంది. భారతదేశంలో ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యం. Mobileye (ఒక ఇంటెల్ కంపెనీ) ద్వారా ADAS సాంకేతికతపై పైలట్ స్టడీ చేసింది. ఇక్కడ వాహనం విండ్‌షీల్డ్‌పై అమర్చబడిన కెమెరా మొత్తం రహదారిని స్కాన్ చేస్తుంది. ప్రమాదాలను ట్రాక్ చేయడానికి సంక్లిష్ట అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. సిస్టమ్ ఢీకొనే ప్రమాదాన్ని గుర్తిస్తే, అది డ్రైవర్‌కు క్షణాల్లోనే ఆడియో, వీడియో హెచ్చరికను జారీ చేస్తుంది.
ఉదాహరణకు, డ్రైవర్ ముందున్న వాహనానికి చాలా దగ్గరగా వస్తే, డేంజర్ అని అతనిని హెచ్చరిస్తుంది, తద్వారా అతను వేగాన్ని తగ్గించి, సురక్షితమైన స్పీడ్ ను కొనసాగించవచ్చు. పాదచారులు, సైక్లిస్టులు లేదా విచ్చలవిడి సంచరించే జంతువులతో ఢీకొనే ప్రమాదం ఉన్నట్లయితే.. ఇదే విధమైన హెచ్చరిక ధ్వనిస్తుంది. సిగ్నలింగ్ లేకుండా మీ నిర్దేశిత లేన్ నుంచి దూరంగా ఉన్న సందర్భంలో, లేగా రాంగ్ లేన్‌లోకి అనుకోకుండా వెళ్లినపుడు కూడా ఈ సిస్టమ్ హెచ్చరికను అందిస్తుంది. అయితే ఈ పైలెట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్టడీ తుది నివేదిక ఇంకా వెలువడాల్సి ఉందని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం పొందిన తరువాత, TGSRTC బస్ ఫ్లీట్ అంతటా ADAS పరికరాలను ఇన్ స్టాల్ చేయనున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..