Agra Viral Video | మోమోలు తీసుకురాలేదని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
Agra : తనకు ఇష్టమైన ఇష్టమైన మోమోలు (Momos) తీసుకురావడం మరిచిపోతున్నాని ఓ మహిళ తన భర్త పై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా ప్రతీరోజు తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విస్తూపోయారు. తర్వాత తేరుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదుర్చారు. ఈ ఆసక్తికర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్‌కు చెందిన వ్యక్తితో 8 నెలల క్రితం వివాహమైంది. అయితే ఉత్తరాదిలో బాగా పాపులర్ మోమోలు బాగా పాపులర్. అయితే సదరు మహిళకు కూడా మోమోలు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వచ్చేముందు రోజూ భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు.
కాగా, గత కొన్ని రోజులుగా సదరు వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె అలిగి తన పుట్టింటికి వెళ్లింది. అంతేగాక భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన ఫిర్యాదు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ జంటను ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి పిలిపించారు.
భార్యాభర్తల మధ్య డీల్ కుదర్చిన పోలీసులు
మరోవైపు పనిఒత్తిడి కారణంగా , ఇంటికి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు భార్య కోసం మోమోలు తీసుకురావడం మరిచిపోతున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. అయితే తన కోసం ప్రతీ రోజు కచ్చితంగా మోమోలు తీసుకురావాలని ఆ మహిళ తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు వారిద్దరి మధ్య ఒక డీల్ కుదిర్చారు. ఆ వ్యక్తి తన సతీమణి కోసం వారానికి రెండుసార్లు తప్పకుండా మోమోలు తీసుకురావాలని కండీషన్ పెట్టారు. దీనికి ఒప్పుకున్న ఆ మహిళ తన భర్తతో కలిసి ఇంటికి తిరిగి వెళ్లింది.
आगरा : मोमोज के चक्कर में पति-पत्नी के बीच आई दरार
➡मोमोज न लाने पर पत्नी ने पुलिस से की पति की शिकायत
➡शिकायत के बाद मामला परिवार परामर्श केंद्र हुआ ट्रांसफर
➡काउंसलिंग के बाद पति-पत्नी के बीच हुआ समझौता
➡हफ्ते में दो बार मोमोज खिलाने को लेकर हुआ समझौता
➡मलपुरा की युवती की… pic.twitter.com/39nXczmKZP— भारत समाचार | Bharat Samachar (@bstvlive) February 26, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
సూపర్