ఆది శంకరాచార్య 108 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణ..
Adi Shankaracharya Statue : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓంకారేశ్వర్ లో 8వ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు, గురువు ఆదిశంకరాచార్య 108 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం ‘Statue of Oneness’ )’ అని పేరుపెట్టారు. ఈ విగ్రహాన్ని నర్మదా నది ఒడ్డున గల ఓంకారేశ్వర్ లోని మాంధాత పర్వతంపై నిర్మించారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహం 54 అడుగల ఎత్తైన పీఠంపై ఉంది. దీనికి ‘ఏకత్మాతా కి ప్రతిమా’ (ఏకత్వం యొక్క విగ్రహం) అని పేరుపెట్టారు.
ఓంకారేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శివుడిని ఆరాధించే పవిత్ర క్షేత్రం ఇది. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఓంకారేశ్వర్ లో ఓ మ్యూజియంతో పాటు ఆదిశంకరాచార్య విగ్రహం కోసం రూ.2,141.85 కోట్ల ప్రాజెక్టుకు గత సంవత్సరం ఆమోదం తెలిపింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ ఇండోర్ నగరానికి 80 కి.మీ దూరంలో ఉంది. “అద్వైత వేదాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్య, భారతదేశాన్ని ఒక దారంలో ఏకం చేసిన సాంస్కృతిక పునాది ప్రతి యుగానికి ఆయన అద్భుతమైన బహుమతి” అని చౌహాన్ అన్నారు.
ఈ విగ్రహం భారతదేశంలో ప్రభుత్వం నిర్మించిన మూడవ అతిపెద్ద విగ్రహం. గతంలో 11వ శతాబ్దపు భక్తి సన్యాసి శ్రీ రామానుజాచార్య 1,000వ జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం హైదరాబాద్ శివారులో సమానత్వ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2018లో గుజరాత్ లోని కెవాడియాలో మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ మహోన్నత వ్యక్తి ఎవరు?
కేరళలో జన్మించిన ఆదిశంకరాచార్య, ఒక యువ సన్యాసిగా ఓంకారేశ్వర్ కు చేరుకున్నట్లు చెబుతారు, అక్కడ అతను తన గురువైన గోవింద్ భగవద్పాద్ ను కలుసుకున్నారు. పవిత్ర నగరంలో నాలుగు సంవత్సరాలు నివసించాడు. అక్కడ గురువు బోధనలు విన్నాడు. తన ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా, అతను 12 సంవత్సరాల వయస్సులో ఓంకారేశ్వర్ ను విడిచిపెట్టాడు. అద్వైత వేదాంత తత్వశాస్త్రం బోధనలను వ్యాప్తి చేయడం కోసం దాని సూత్రాలను ప్రజలకు వివరించడం కోసం ఒక యాత్రను ప్రారంభించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.