దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన

దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నేడు ప్రధాన మోదీ శంకుస్థాపన

తెలంగాణలో 21 స్టేషన్ల ఎంపిక

దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్‌ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.
“ఇంత భారీ సంఖ్యలో స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని, కాబట్టి ఇది చారిత్రాత్మక ఘట్టం అవుతుంది” అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 2025 నాటికి ఈ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ప్రాజెక్ట్ పురోగతిని ప్రధాని పర్యవేక్షిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ స్టేషన్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రధాన దృష్టి కేంద్రీకరిచింది. ఈ రైల్వే స్టేషన్ల పురోగతిని ప్రధాని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈ స్టేషన్ల డిజైన్లలో ఇన్‌పుట్‌లను ఇచ్చారు. ఈ 508 స్టేషన్‌లకు పునాది వేయనున్నారు’’ అని తెలిపారు.

READ MORE  ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

తెలంగాణలో 21 రైల్వేస్టేషన్ల ఎంపిక

దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పునరాభివృద్ధి కోసం 508 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశరు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లలో 55 చొప్పున, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. ఇక తెలంగాణ 21 గుజరాత్ లో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.

READ MORE  vande bharat sleeper coach | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..

తెలంగాణ: హైదరాబాద్‌, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మలక్ పేట, మల్కాజిగిరి, హఫీజ్ పేట, కాజీపేట, ఖమ్మం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, మధిర, జహీరాబాద్‌.
ఆంధ్రప్రదేశ్‌: కర్నూలు, కాకినాడ టౌన్‌, ఏలూరు, భీమవరం, తెనాలి, పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రేపల్లె, పిడుగురాళ్ల, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.

స్టేషన్లలో ఈ సౌకర్యాలను కల్పించనున్నారు..

  • ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
  • ఎస్కలేటర్లు
  • ఎలివేటర్లు
  • ద్విచక్ర వాహనాలు, కార్ పార్కింగ్ ప్రాంతాలు
  • ల్యాండ్‌స్కేపింగ్/హార్టికల్చర్ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
  • సిగ్నల్స్ప్లాట్‌ఫారమ్‌లు, ప్లాట్‌ఫారమ్ షెల్టర్‌ల మెరుగుదల
  • బెంచీలు, వాష్ బేసిన్లు
  • మెరుగైన లైటింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు
  • సీసీటీవీలు

ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ల అభివృద్ధి చేపట్టారు. స్టేషన్‌లలో మెరుగైన యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్‌లు, లిఫ్ట్/ఎస్కలేటర్‌లు, ఉచిత Wi-Fi, స్థానిక ఉత్పత్తుల కోసం ‘ఒక స్టేషన్ వన్ ప్రొడక్ట్’ వంటి వాటితోపాటు మరెన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.
అలాగే మెరుగైన ప్రయాణికుల సమాచార వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, వ్యాపార సమావేశాల కోసం స్థలాలు, ల్యాండ్‌స్కేపింగ్ మొదలైనవి ప్రాజెక్ట్‌లో భాగంగా ప్లాన్ చేశారు.

READ MORE  తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం వందేభారత్ ను చూడండి. లేటెస్ట్  అప్డేట్స్ కోసం ట్విట్టర్ లోనూ సంప్రదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *