Types-of-salt And Health benefits : మన తీసుకునే ఆహారానికి సరైన రుచిని ఇచ్చేది ఉప్పు. ఎంత కమ్మగా వండినా అందులో ఉప్పు తగిన పరిమాణంలో లేకపోతే మనకు ఏమాత్రం రుచించదు. అన్నింటికంటే ముఖ్యంగా మన శరీరానికి కావలసిన సోడియం ఉప్పు కారణంగానే ఆహారం ద్వారా మనకు అందుతుంది.
శరీరంలో అనేక జీవ ప్రక్రియలకు సోడియం ఎంతో అవసరం.దీనితోనే శరీరంలోని కణాలు సవ్యంగా పనిచేస్తాయి. ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతుల్యం
కుదురుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.మన శరీరానికి కావాలసిన సోడియంలో 90 శాతం ఉప్పు నుండే లభిస్తుంది. ఉప్పు సాంకేతిక నామం సోడియం క్లోరైడ్.
అయితే ఈ ఉప్పులో వాటి రూపం, రుచి, కూర్పును బట్టి చాలా రకాలు ఉన్నాయి. ఇవి రుచిలోపాటు పోషక విలువల్లో కూడా భిన్నంగా ఉంటాయి. మార్కెట్ లో లభించే పలు ఉప్పు రకాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం..
టేబుల్ ఉప్పు(Table Salt)
అత్యంత సాధారణంగా అందరి ఇళ్లో వాడే ఉప్పు, ప్రధానంగా సోడియం క్లోరైడ్‌తో ఉంటుంది. అయోడిన్ లోపాన్ని నివారించడానికి టేబుల్ సాల్ట్ అయోడిన్‌తో కలిపి విక్రస్తుంటారు. ఈ ఉప్పులో ఉండే సోడియం, శరీరంలో నీటి సమతుల్యత, నరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్ థైరాయిడ్ ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. గాయిటర్ వ్యాధిని నివారిస్తుంది. ఎన్ని ఉపయోగాలున్నప్పటికీ టేబుల్ సాల్ట్ పరిమితికి మించి తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బులు లేదా స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల నియంత్రణ అనేది కీలకం.
సముద్రపు ఉప్పు (Sea Salt)
సముద్రపు నీటిని ఎండబెట్టి ఈ సముద్రపు ఉప్పు తయారుచేస్తారు. దీన్ని ఎక్కువగా శుద్ధి చేయరు కాబట్టి సహజంగానే ఈ ఉప్పు వివిధ ఖనిజాలు, ట్రేస్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది. ఈ ఉప్పులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి చిన్న మొత్తంలో ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది సాధారణంగా టేబుల్ ఉప్పు కంటే తక్కువ ప్రాసెస్ చేస్తారు కాబట్టి సముద్రపు ఉప్పు కొన్ని సహజ పోషక
ఖనిజాలను కలిగి ఉంటుంది.
హిమాలయన్ పింక్ సాల్ట్ (Himalayan Pink Salt)
ఈ ఉప్పును రాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ఉప్పుగా పరిగణిస్తారు. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతం ఖేవ్డా ఉప్పు గనుల నుండి తవ్వి తీస్తారు. విలక్షణమైన గులాబీ రంగుతో ఈ ఉప్పు ప్రసిద్ధి చెందింది. హిమాలయన్ గులాబీ ఉప్పులో ఇనుము,
పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. టేబుల్ సాల్ట్‌తో పోలిస్తే హిమాలయన్ సాల్ట్‌లో సోడియం కంటెంట్ తక్కువగా ఉందని కొన్ని ఆధారాలు పేర్కొన్నాయి. పోషక ఖనిజాల పరంగా ఇది చాలా ఉత్తమమైనది. ఇందులో శరీరానికి మేలు చేసే 84 రకాల ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
కోషర్ ఉప్పు (Kosher Salt)
కోషెర్ ఉప్పు ముతక ఆకృతి(coarse texture)ని కలిగి ఉంటుంది. కోషెర్ ఉప్పును సాధారణంగా వంట ఉప్పు లేదా కాషరింగ్ ఉప్పు అని పిలుస్తారు. ఇది ఉప్పు స్ఫటికాల నుండి తయారు చేయబడిన ముతక-కణిత ఉప్పు. ఇది ప్రాథమికంగా సోడియం క్లోరైడ్, సాధారణ టేబుల్ ఉప్పు కంటే చాలా పెద్ద ముతక ధాన్యం పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ కోషెర్ ఉప్పులో 1,120 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. సాధారణంగా కోషెరింగ్ మాంసాలలో లేదా వేపుడు వంటల్లో ఉప్పుగా ఉపయోగిస్తారు. ఉప్పు సాధారణంగా అయోడిన్ లేదా యాంటీ-కేకింగ్ ఏజెంట్ల వంటి సంకలితాలను కలిగి
ఉండదు, ఇది వంటలో లేదా ఆహార పదార్థాలపై చిలకరించడం కోసం తరచుగా ఉపయోగిస్తారు. కోషెర్ ఉప్పు చేపల వంటి మాంసంపై తేమను తొలగించేందుకు కూడా వాడుతారు. ఎందుకంటే ఇది సాధారణ లవణాల కంటే పెద్ద సైజులో రేణువులు ఉండడంతో ఇది మాంసం యొక్క షెల్ఫ్ జీవితాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
సెల్టిక్ సముద్ర ఉప్పు (Celtic Sea Salt)
సెల్టిక్ సముద్రపు ఉప్పు ఫ్రాన్స్ల్ లోని తీర ప్రాంతాల నుండి సేకరిస్తారు. దాని తేమను నిలుపుకుంటుంది. ఇది మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి అంతర్గత అవయవాలకు, నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. సెల్టిక్ ఉప్పు అనేక రకాల ఉప్పులో పురాతనమైన వాటిలో ఒకటి. ఇది కొద్దిగా బూడిద రంగులో ఉంటుంది. చేపలు, మాంసం వండడానికి ఇది మంచిదని భావిస్తారు.
ఎప్సోమ్ సాల్ట్ (Epsom Salt)
ఈ రకమైన ఉప్పును వంటల్లో ఉపయోగించరు. ఎప్సమ్ లవణాలు తరచుగా స్నానాలలో విశ్రాంతి, కండరాల పునరుద్ధరణ కోసం వాడుతారు. ఈ ఎప్సమ్ ఉప్పు తో మర్దనా చేసుకోవడం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయి. కండరాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించి నొప్పిని నివారించడంలో ఈ సాల్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ కండరాల్లో కణజాలాల్లోకి వెళ్లి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
నల్ల ఉప్పు
ఈ రకమైన సాల్ట్ కూడా హిమాలయ ప్రాంతాల్లోనే లభిస్తుంది. ఇది బొగ్గు, మూలికలు, గింజలు, బెరడుతో కూడిన కూజాల వంటివాటిలో ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. అది నాలుగు గంటలపాటు కొలిమిలో పెడతారు. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా మంచిదని చెబుతారు. కోడిగుడ్డు తినని శాకాహారులు ఆహారంలో వాడితే గుడ్డు రుచి కూడా వస్తుంది.
Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం వందేభారత్ ను చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ట్విట్టర్ లోనూ సంప్రదించండి