Sunday, April 27Thank you for visiting

ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..

Spread the love

తెలంగాణలో 21, ఏపీలో 18, రైల్వేస్టేషన్ల అభివృద్ధి కి శంకుస్థాపన చేసిన ప్రధాని

దేశంలోని అన్ని ప్రాంతాల్లో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమృత్ భారత్ పథకం కింద రూ.25 వేల కోట్ల నిధులతో దేశంలోని 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆదివారం వర్చువల్ గా మోదీ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ రైల్వే రంగంలో ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని ఆయన అన్నారు.

కాగా, ఈ ప్రాజెక్టుకు రూ. 24,470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

READ MORE  Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

తెలంగాణలో 21 రైల్వేస్టేషన్ల ఎంపిక

దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పునరాభివృద్ధి కోసం 508 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశరు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్‌లలో 55 చొప్పున, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 ఉన్నాయి. ఇక తెలంగాణ 21 గుజరాత్ లో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18 చొప్పున, హర్యానాలో 15, కర్ణాటకలో 13 ఉన్నాయి.

READ MORE  దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   

తెలంగాణ: హైదరాబాద్‌, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మలక్ పేట, మల్కాజిగిరి, హఫీజ్ పేట, కాజీపేట, ఖమ్మం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్‌, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), ఆదిలాబాద్‌, భద్రాచలం రోడ్‌, మధిర, జహీరాబాద్‌.
ఆంధ్రప్రదేశ్‌: కర్నూలు, కాకినాడ టౌన్‌, ఏలూరు, భీమవరం, తెనాలి, పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రేపల్లె, పిడుగురాళ్ల, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ.

స్టేషన్లలో ఈ సౌకర్యాలను కల్పించనున్నారు..

  • ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
  • ఎస్కలేటర్లు
  • ఎలివేటర్లు
  • ద్విచక్ర వాహనాలు, కార్ పార్కింగ్ ప్రాంతాలు
  • ల్యాండ్‌స్కేపింగ్/హార్టికల్చర్ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
  • సిగ్నల్స్ప్లాట్‌ఫారమ్‌లు, ప్లాట్‌ఫారమ్ షెల్టర్‌ల మెరుగుదల
  • బెంచీలు, వాష్ బేసిన్లు
  • మెరుగైన లైటింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు
  • సీసీటీవీలు
READ MORE  Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు

ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్టేషన్ల అభివృద్ధి చేపట్టారు. స్టేషన్‌లలో మెరుగైన యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్‌లు, లిఫ్ట్/ఎస్కలేటర్‌లు, ఉచిత Wi-Fi, స్థానిక ఉత్పత్తుల కోసం ‘ఒక స్టేషన్ వన్ ప్రొడక్ట్’ వంటి వాటితోపాటు మరెన్నో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.
అలాగే మెరుగైన ప్రయాణికుల సమాచార వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, వ్యాపార సమావేశాల కోసం స్థలాలు, ల్యాండ్‌స్కేపింగ్ మొదలైనవి ప్రాజెక్ట్‌లో భాగంగా ప్లాన్ చేశారు.


Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం వందేభారత్ ను చూడండి. లేటెస్ట్  అప్డేట్స్ కోసం ట్విట్టర్ లోనూ సంప్రదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..