Saturday, April 19Welcome to Vandebhaarath

ఆగస్టు 1న 466 కొత్త 108 అంబులెన్స్‌లు, 102 అమ్మ ఒడి వాహనాలు ప్రారంభం

Spread the love

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 108 ఎమర్జెన్సీ వాహనాలు, అమ్మ ఒడి 102 వాహనాలు, హీర్స్ వెహికల్స్‌(Hearse Vehicles) ను ఆగస్టు 1న 466 సరికొత్త వాహనాలను ప్రారంభించనున్నారు.

వీటిలో 204 వాహనాలు 108 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి వాహనాలు, 34 హియర్స్ వాహనాలు, మరణించిన వారి మృతదేహాలను వారి స్వస్థలానికి ఉచితంగా తరలించడానికి ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి.

ప్రస్తుతం 108 ఎమర్జెన్సీ కోసం 426 వాహనాలు ఉన్నాయి. వాటిలో 175 వాహనాలను కొత్త వాటితో భర్తీ చేస్తున్నారు. 29 కొత్త అంబులెన్స్‌లు కొత్త రూట్లలో సేవలు అందించనున్నాయి. ఆగస్టు 1 నుంచి 108 ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో మొత్తం 455 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

READ MORE  ఆగస్టు చివరి వారంలో హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ప్రస్తుతం అమ్మ ఒడిలో 300 నాన్ ఎమర్జెన్సీ వాహనాలు ఉండగా, అందులో 228 వాహనాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న 34 పాత హార్స్ వాహనాల స్థానంలో అదే సంఖ్యలో కొత్త వాహనాలు వస్తున్నాయి.

ఈ విషయమై వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘అంబులెన్స్‌లు, అమ్మ ఒడి, హార్సు వాహనాలను అప్‌డేట్ చేయాలని కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. పాత వాహనాలన్నింటి స్థానంలో కొత్తవి వచ్చేలా చూసుకున్నాం. తెలంగాణలో అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది’’ అని అన్నారు.

READ MORE  South Central Railway | సికింద్రాబాద్ - కాజీపేట - విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *