Zodiac signs| ఈ వారం ఈ రాశివారికి మంచి ఫలితాలు..
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు మార్పులు చేర్పులు చేసే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశాలు కలవు. స్నేహితుల సలహాలు లాభిస్తాయి. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. దైవానుగ్రహం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. Chit Fund వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. అసంతృప్తి భోజనం ఉంటుంది. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. ప్రభుత్వ వైద్య వృత్తి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. సంకల్పించిన పనుల సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన ఖర్చులు చేయకుండా ధనాన్ని పొదుపు చేసుకోవాలి. అప్పు కొంత తీర్చ గలుగుతారు. భూమి లేదా జాగలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు ధన సహాయం చేయడం ద్వారా నష్టపోయే అవకాశం కలదు. స్త్రీలు ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ పిల్లల మాట తీరు మీ మనసును నొప్పిస్తుంది. స్త్రీలు వంట చేసేటప్పుడు శరీరానికి గాయాలయ్య అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. నూతన వధూవరులు తగాదాలకు దూరంగా ఉండాలి. బంగారం వ్యాపారస్తులకు నష్టము కలిగే అవకాశాలు కలవు. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. పోలీసు శాఖ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉండును. ధనపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవాడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ వారంలో విద్యార్థులకు శుభ ఫలితాలు ఉండును. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామితో తగాదాలు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకై అడుగులు పడతాయి. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. విదేశీయాన ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. వైరల్ ఫీవర్ మరియు పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ విషయాలు ఇతరులతో చర్చించకూడదు. Software ఉద్యోగస్తులకు సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉండును. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ప్రయాణములు చేయవలసి వస్తుంది. బంధువులతో కలిసి విందు భోజనం చేస్తారు. మధ్యవర్తిత్వం అంత మంచిది కాదు. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఒక స్నేహితుని ఆర్థిక సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. పోలీస్ శాఖ వారికి స్థానచలనం కలిగే అవకాశం కలవు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. వెండి వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఆస్తి విషయమై తండ్రితో తగాదాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
సింహ రాశి
సింహరాశి వారికి ఈ వారంలో స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. పాత బాకీలు వసూలవుతాయి. తల్లి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. Paints వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయి. Hair fall ఒక సమస్యగా మారుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. మతిమరుపు వలన కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. వారం చివరలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. తరచూ మీ ఆలోచనలను మార్చుకుంటారు. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అగ్ని సంబంధిత వస్తువులతో అప్రమత్తంగా ఉండాలి. Fast food items వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. శత్రువుల మీద వ్యూహరచన చేస్తారు. మీ జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. Administration రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు నివాసము మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. Jewellery వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సంతాన భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు మిశ్రమ మైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. Real Estate వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. నూతన గృహ ప్రారంభానికి అడుగులు పడతాయి. చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడతారు. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారంలో శారీరక సౌఖ్యం ఉంటుంది. కండరాల నొప్పులతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. జ్యోతిష్య వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో తగాదాలు ఏర్పడతాయి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. చెడు వ్యసనాల జోలికి పోకూడదు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. సోదరుల సలహాలు లభిస్తాయి. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ వారంలో సంతాన భవిష్యత్తు కోసం ప్రణాళికను సిద్ధం చేయాలి. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లితో కలహం అంత మంచిది కాదు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. oil వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. రెవెన్యూ మరియు బ్యాంక్ శాఖ ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ తెలివితేటలతో రాబోయే సమస్యలను ముందుగానే పసిగడతారు. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇబ్బందులు ఉండును. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారంలో ఆదాయానికి మించిన ధన వ్యయం ఉండును. మానసిక ఆందోళనని ధైర్యంగా అధిగమించాలి. మీ దగ్గర పని చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. తండ్రికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. మీరు ఇతరుల మీద చూపించే ప్రేమ ఆరాటం వల్ల నష్టపోయే అవకాశం కలదు. రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. Chit Fund company వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ప్రతి విషయం లోను మొండితనం అంత మంచిది కాదు. ధన పరమైన ఇబ్బందులు తొలగుతాయి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఇన్సూరెన్స్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఉండును. శరీరంలో వేడి పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారంలో పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరగా అలసిపోతారు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. Medical Store వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. Skin infections వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలుగును. కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వీరభద్ర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలు అందం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. గృహ అలంకారానికి సంబంధించిన వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. యోగా వ్యాయామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. Dairy Products వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. తండ్రి ఆస్తి పంపకాల విషయంలో మీ వాటా చేతికి అందుతుంది. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన ఆలోచనలు చేయకూడదు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. తల్లి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..